మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మాతృ వియోగం
అనంతపురం:
రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాసులు మాతృమూర్తి గురువారం ఉదయం మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కాల్వ పుల్లమ్మ(80) గురువారం ఉదయం కన్నుమూశారు.
ఆమె మృతిపై పలువురు మంత్రులు, నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి కాల్వ శ్రీనివాసులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.