కృపామణి కేసులో కీలక నిందితుడు అరెస్టు!
ఏలూరు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసులో కీలక నిందితుడు గుడాల సాయిశ్రీనివాస్‌ను పోలీసులు బుధవారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గత నెల 19న కాల్వలోకి దూకి కృపామణి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు తనను గదిలో బంధించి వేధించారని, సాయిశ్రీనివాస్‌తో వ్యభిచారం చేయాలని బలవంతం చేశారని కృపామణి సెల్‌ఫోన్ ద్వారా రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలో వెల్లడించింది. ఈ కేసులో గతంలోనే కృపామణి తల్లిదండ్రులు, సోదరుడిని అరెస్టు చేశారు. తాజాగా కీలక నిందితుడిగా భావిస్తున్న గుడాల సాయిశ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది.