Krupamani suicide
-
కృపామణి కేసులో కీలక నిందితుడు అరెస్టు!
ఏలూరు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసులో కీలక నిందితుడు గుడాల సాయిశ్రీనివాస్‌ను పోలీసులు బుధవారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గత నెల 19న కాల్వలోకి దూకి కృపామణి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు తనను గదిలో బంధించి వేధించారని, సాయిశ్రీనివాస్‌తో వ్యభిచారం చేయాలని బలవంతం చేశారని కృపామణి సెల్‌ఫోన్ ద్వారా రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలో వెల్లడించింది. ఈ కేసులో గతంలోనే కృపామణి తల్లిదండ్రులు, సోదరుడిని అరెస్టు చేశారు. తాజాగా కీలక నిందితుడిగా భావిస్తున్న గుడాల సాయిశ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది. -
కృపామణి ఆత్మహత్య కేసులో పురోగతి
-
కృపామణి ఆత్మహత్య కేసులో పురోగతి
ఏలూరు(పశ్చిమగోదావరి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసులో పురోగతి కనిపించింది. ఈ కేసులో నిందితుడైన కృపామణి తండ్రి రామలింగేశ్వరరావును ఆదివారం దెందులూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో ప్రధాన నిందితుడు గుడాల సాయి శ్రీనివాసరావు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ హైవే టోల్గేట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా గుడాల సాయిశ్రీనివాస్ విశాఖపట్టణంలోనే ఉన్నట్టు పోలీసులు సమాచారం అందింది. సమాచారం మేరకు ప్రత్యేక బృందాలు, టాస్క్‌ఫోర్స్ కూడా రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇదిలా ఉండగా, శుక్రవారం దెందులూరు మండలం చిల్లచింతలపూడిలో కృపామణి తల్లి లక్ష్మి, సోదరుడు రాజ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, తణుకుకు చెందిన గుడాల సాయి శ్రీనివాస్‌తో పాటు కృపారాణి తల్లిదండ్రులు, సోదరుడు తనను వ్యభిచారం చేయాలని తీవ్రంగా వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని కృపామణి సెల్ఫీ ద్వారా సెల్ఫోన్లో రికార్డ్ చేసి కాలువలో పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఎస్పీ భాస్కర్‌భూషణ్ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. -
కృపామణి ఆత్మహత్య కేసులో నిందితులు
- పోలీసులకు చిక్కని కృపామణి ఆత్మహత్య కేసులో నిందితులు - సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు - రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ తణుకు(పశ్చిమగోదావరి): వేల్పూరుకు చెందిన వివాహిత వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య చేసుకుని వారం అరుునా ఇప్పటి వరకు ఈ కేసులో పురోగతి కనిపించటం లేదు. పోలీస్ ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి అధికారులపై తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. కేసులో ప్రధాన నిందితుడు గుడాల సాయిశ్రీనివాస్, ఆమె కుటుంబ సభ్యులు పరారీలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసును స్వయంగా పరిశీలించి అడిషినల్ డీజీ ఠాకూర్‌కు ఆదేశాలు జారీ చేయడంతో ఎస్పీ భాస్కర్‌భూషణ్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బుధవారం కూడా ఆయన తణుకులోనే ఉన్నారు. కేసు విషయమై పలువురు అధికారులతో సమీక్షించారు. విశాఖలో గుడాల? గుడాల సాయిశ్రీనివాస్ విశాఖలో తలదాచుకున్నాడన్న సమాచారం పోలీసులకు అందింది. ప్రత్యేక బృందాలు ఇప్పటికే నిందితుల వేటలో ఉండగా ఇప్పుడు టాస్క్‌ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. నేషనల్ హైవే టోల్గేట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా సాయిశ్రీనివాస్ విశాఖపట్టణంలోనే ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. విశాఖకు చెందిన బడా వ్యక్తి అతనికి ఆశ్రయం ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. సీసీ ఫుటేజీలో గుడాలతోపాటు కారులో మరో వ్యక్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి వివరాలను సేకరించే పనిలోను పోలీసులు ఉన్నారు. కృపామణి తల్లిదండ్రులు, సోదరుడు కూడా పోలీసులకు చిక్కకపోవడంతో గుడాలతోనే వారూ ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముందస్తు బెయిల్ కోసం... సాయిశ్రీనివాస్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు బార్ కౌన్సిల్ నేతలతో మాట్లాడి అతనికి బెయిల్ రాకుండా సహకరించాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. సాయిశ్రీనివాస్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే తణుకులోనిన్యాయవాది ఒకరు బుధవారం ఉదయం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. సాయిశ్రీనివాస్‌కు గతంలో సహకరించిన వ్యక్తులపైనా పోలీసులు నిఘా ఉంచినట్టు తెలుస్తోంది. రెండు రోజుల్లో నిందితుల అరెస్ట్ కృపామణి ఆత్మహత్య కేసులో నిందితులను రెండు రోజుల్లో అరెస్ట్ చేయిస్తామని రాష్ట్ర మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. కృపామణి భర్త, అత్త, కుమారుడిని బుధవారం ఆమె పరామర్శించారు. ఆమె విలేకరులతో మాట్లాడారు. నిందితుడికి పోలీసు ఉన్నతాధికారులు లేదా రాజకీయ నాయకులు సహకరిస్తున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఈ కేసులో ఎవరినీ విడిచిపెట్టేది లేదన్నారు. ఈ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఎస్పీ భాస్కర్ భూషణ్, డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు ఆత్మకూరి బులిదొరరాజు, వేల్పూరు సర్పంచ్ పెనుమర్తి వెంకటలక్ష్మి ఆమె వెంట ఉన్నారు. -
నాన్నా.. అమ్మ ఎక్కడికి వెళ్లింది!
తణుకు(పశ్చిమగోదావరి) : వారం రోజులుగా తమ ఇంటి ఆవరణలో పోలీసు బూట్ల చప్పుళ్లు.. ప్రముఖులు, రాజకీయ నాయకుల పరామర్శలు.. తనను చూసి అయ్యో పాపం అంటున్న ఇరుగు పొరుగు.. ఇదంతా ఆ మూడేళ్ల చిన్నారికి వింతగా ఉంది. తన తల్లి కొన్ని రోజులుగా ఎందుకు కనిపించడం లేదేంటి? తనను లాలించి గోరుముద్దలు తినిపించే అమ్మ ఏమైంది? ఇవే ఆ చిన్నారి ప్రశ్నలు. వేల్పూరుకు చెందిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుమారుడు మూడేళ్ల కార్తీక్ మాత్రం అమ్మ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడిప్పుడే ఊహ తెలుస్తున్న కార్తీక్ తన తల్లిపై బెంగతో జ్వరం బారిన పడ్డాడు. అమ్మ ఊరెళ్లింది ఇదిగో వచ్చేస్తుంది అని నమ్మిస్తున్న కుటుంబ సభ్యులు ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిందనే విషయం చెప్పలేక సతమతమవుతున్నారు. కేసు విచారణలో పోలీసులకు సహకరించేందుకు అతని తండ్రి నాగపవన్‌కుమార్ పోలీసు స్టేషన్ చుట్టూ తిరగాల్సి రావటంతో ఇంటి దగ్గర ఉన్న నానమ్మ వెంకటరమణ ఆ చిన్నారిని సాకుతోంది. టీవీలో తన తల్లి కనిపించిన ప్రతిసారి అమ్మా అంటూ వెక్కివెక్కి ఏడుస్తూ అమ్మ కావాలని మారాం చేస్తుండటం చూస్తున్న వారి కళ్లూ చెమర్చుతున్నాయి.