8న కురుబ వధూవరుల పరిచయ వేదిక | kuruba marriage links on 8th | Sakshi
Sakshi News home page

8న కురుబ వధూవరుల పరిచయ వేదిక

Published Tue, Oct 4 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

kuruba marriage links on 8th

అనంతపురం రూరల్‌ : కురుబ వధూవరుల పరిచయ వేదికను ఈనెల 8న గుత్తిరోడ్డులోని కనకదాస కళ్యాణమంటపంలో నిర్వహిస్తున్నట్లు కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాగే పరశురాం తెలిపారు. మంగళవారం సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 8న నిర్వహించే వధూవరుల పరిచయ వేదికకు వధూవరుల పాస్‌ ఫొటోలతో హాజరు కావాలన్నారు.

వేదికపైనే వధూవరుల వివరాలను సైతం వివరిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 9866166777, 9440488444 నంబర్లలో సంప్రదించాలని కోరారు. సమావేశంలో కురుబ సంఘం నాయకులు పిడుగు క్రిష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement