వైఎస్సార్ సీపీలో చేరుతున్న నాయకులు
ఖమ్మం : వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఖమ్మం జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి సమక్షంలో ఖమ్మం నగరానికి చెందిన నాయకులు తుమ్మా అప్పిరెడ్డితోపాటు పలువురు హైదరాబాద్‌లో సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో రాఘవరెడ్డి.. జిల్లా నాయకులు తుమ్మా అప్పిరెడ్డి, కొవ్వూరి శ్రీనివాస్, ఆదోని రాజవర్ధన్‌రెడ్డి, కత్తి శ్రీను, ఎస్.కృష్ణారెడ్డి తదితరులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ వైఎస్సార్ పేదల అభివృద్ధి కోసం నిత్యం పరితపించేవారని, ఆయన ఆశయ సాధన కోసం ఆవిర్భవించిన పార్టీలో చేరడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మందడపు వెంకటరామిరెడ్డి, ఆలస్యం సుధాకర్, మందడపు వెంకటేశ్వరరావు, ఆలూరి సత్యనారాయణ, కరీం, రమణ తదితరులు పాల్గొన్నారు.