Join in
-
Lok Sabha elections 2024: టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమబెంగాల్లో బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. కాషాయ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ముకుట్ మణి అధికారి గురువారం అధికార టీఎంసీలో చేరారు. నడియా జిల్లా రాణాఘాట్ దక్షిణ్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన అధికారి గురువారం కోల్‌కతాలో జరిగిన టీఎంసీ ర్యాలీలో సీఎం మమతా బెనర్జీతోపాటు పాల్గొన్నారు. సిట్టింగ్ ఎంపీ జగన్నాథ్ సర్కారుకే మళ్లీ రాణాఘాట్ టిక్కెట్ ఇవ్వాలన్న బీజేపీ అధిష్టానం నిర్ణయంపై అసంతృప్తితో పార్టీ మారారు. ప్రజల కోసమే పనిచేసే పార్టీ టీఎంసీ, అందుకే పార్టీలో చేరానని చెప్పారు. ముకుట్ మణి అధికారి తమ పార్టీలో చేరారని టీఎంసీ తెలిపింది. దీంతో, 2021లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక టీఎంసీలో చేరిన బీజేపీల సంఖ్య ఎనిమిదికి చేరింది. -
తొలిసారి కీ రోల్ చేస్తున్న శ్రుతి హాసన్.. నాని సినిమాలో!
సంక్రాంతికి విడుదలైన రెండు భారీ సినిమాలు ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’లో కథానాయికగా అలరించారు శ్రుతీహాసన్. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఇంగ్లిష్ చిత్రం ‘ది ఐ’ కూడా ఉంది. తాజాగా నాని సినిమాలో కీలక పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు శ్రుతి. ఇప్పటివరకూ ప్రత్యేక పాటల్లో కనిపించిన ఈ బ్యూటీ కీ రోల్స్ చేయలేదు. సో.. నాని సినిమాలో చేయనున్నది శ్రుతీకి తొలి కీలక పాత్ర అవుతుంది. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్లో జాయిన్ అయ్యారు శ్రుతీహాసన్. ఇక నాని సరసన కథానాయికగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. వైర ఎంటర్టైన్మెంట్స్పై మోహన్ చెరుకూరి (సీవీఎం), డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, కెమెరా: సాను జాన్ వర్గీస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సతీష్ ఈవీవీ. -
బీజేపీ అనే వైరస్‌కు వ్యాక్సిన్ మమతే.. అభిషేక్ బెనర్జీ తీవ్ర విమర్శలు
అగర్తలా: తృణమూల్ కాంగ్రెస్‌లోకి వలసలు మొదలయ్యాయి. పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి రజీబ్ బెనర్జీ, త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే అశిష్‌దాస్ శనివారం త్రిపురలోని అగర్తలాలో జరిగిన ఒక కార్యక్రమంలో టీఎంసీ గూటికి చేరారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు. 2011, 2016లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన రజీబ్ గత ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి దోమ్జూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తృణమూల్ అధికారంలోకి రావడంతో బీజేపీ నుంచి మళ్లీ మాతృసంస్థకి చేరుకున్నారు. గోవా నుంచి త్రిపుర వరకు పార్టీని విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా అగర్తాలలో తృణమూల్ కాంగ్రెస్ సభ నిర్వహించింది. ఈసారి త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్, రైట్ అందరినీ మట్టికరిపిస్తామని అభిషేక్ధీమా వ్యక్తం చేశారు. ‘‘బీజేపీ అనే వైరస్‌కి వ్యాక్సిన్ ఒక్కటే ఉంది. దాని పేరు మమతా బెనర్జీ. త్రిపుర ఓటర్లు ఆ వైరస్‌కి రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలి. మొదటిది వచ్చే నెలలో జరిగే స్థానిక ఎన్నికల్లోనూ, 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండో డోసు ఇవ్వాలి’’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అగర్తలా ర్యాలీ నిర్వహించాలని గత కొద్ది రోజులుగా టీఎంసీ ప్రయత్నిస్తున్నప్పటికీ అక్కడ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం అడ్డు చెబుతూ వస్తోంది. కరోనా నిబంధనల వల్ల ర్యాలీలకు అనుమతించేది లేదని పోలీసులు తెగేసి చెప్పారు. దీంతో టీఎంసీ కోర్టుకెళ్లింది. చివరికి త్రిపుర హైకోర్టు ర్యాలీకి అనుమతించింది. -
కాంగ్రెస్‌లోకి ఉత్తరాఖండ్ మంత్రి, ఎమ్మెల్యే
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి యశ్పాల్ ఆర్య, తన కుమారుడు, ఎమ్మెల్యే సంజీవ్ ఆర్యతో కలిసి సోమవారం బీజేపీకి రాజీనామా చేసి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో చేరారు. యశ్పాల్ ఆర్య 2007 నుంచి 2014 దాకా ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2017లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాషాయ కండువా కప్పుకున్నారు. యశ్పాల్, సంజీవ్, వారి మద్దతుదారులు ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు హరీష్ రావత్, కె.సి.వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అంతకు ముందు వారు రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిశారు. తనకు చాలా సంతోషంగా ఉందని, సొంతింటికి తిరిగి వచ్చానని యశ్పాల్ వ్యాఖ్యానించారు. ఇది తన ‘ఘర్ వాపసీ’ అని చెప్పారు. ఆయన ఇప్పటిదాకా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాసనసభ స్పీకర్‌గా, మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ బలోపేతం అయితే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని యశ్పాల్ ఈ సందర్భంగా చెప్పారు. ఆయన కుమారుడు సంజీవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మరో బీజేపీ నేత హరీందర్ సింగ్ లడ్డీ కూడా కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీలో చేరిన దేవేందర్ రాణా, సూర్జిత్‌సింగ్ మరోవైపు, జమ్మూకశ్మీర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కీలక నేతలు దేవేందర్ రాణా, సూర్జిత్ సింగ్ స్లాథియా సోమవారం బీజేపీలో చేరారు. వారు ఆదివారమే నేషనల్ కాన్ఫరెన్స్‌కు రాజీనామా సమర్పించారు. వారిద్దరూ ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్సింగ్ పురి, జితేంద్ర సింగ్‌ల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దేవేందర్ రాణా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత అగ్రనేత ఒమర్ అబ్దుల్లాకు రాజకీయ సలహాదారుగా సేవలందించారు. -
యూపీలో యోగికి షాక్
లక్నో: యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా అయ్యేంతవరకు ఆయనకు కుడిభుజంగా ఉన్న హిందూ యువ వాహిని (హెచ్‌వైవీ) మాజీ అధ్యక్షుడు సునీల్ సింగ్ శనివారం సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆపార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ సమక్షంలో పార్టీలో చేరారు. సునీల్‌ను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 2017లో హిందూ యువ వాహిని నుంచి బహిష్కరించడంతో అప్పట్నుంచి వేరే సంస్థను నెలకొల్పి దానికి జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. యోగి ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని, ఇక ఆ ప్రభుత్వం రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష నేతలపై యోగి సర్కార్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకొచ్చాక హిందూ ముస్లిం వర్గ విభేదాలను ప్రోత్సహిస్తోందన్నారు. -
ఆర్మీలో 575 మంది కశ్మీర్ యువకులు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ చెందిన 575 మంది యువకులు భారత సైన్యంలో చేరారు. వారు ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం స్థానిక బానా సింగ్ మైదానంలో పరేడ్ నిర్వహించారు. జమ్మూ కశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ బెటాలియన్‌లో పని చేసేందుకు వీరిని నియమించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. లెఫ్టినెంట్ జనరల్ అశ్వనీ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. దేశానికి సేవ చేయాలనే తపన కశ్మీర్ యువకుల్లో కనపడిందని ఆయన తెలిపారు. తమ కుమారులు ఆర్మీలో పని చేయడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా కొందరు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. -
ఆర్ఎస్ఎల్పీకి భారీ షాక్
పట్నా: ఆర్ఎస్ఎల్పీ అధినేత కుష్వాహాకు ఆ పార్టీ సభ్యులు గట్టి షాక్ ఇచ్చారు. ఇటీవల ఎన్నికలలో పరాభవంతో కుంగిపోతున్న సమయంలోనే ఆదివారం ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఆధ్వర్యంలోని జేడీ(యూ)లో చేరారు. ఎమ్మెల్యేలు లలన్‌పాశ్వాన్, సుధాంశు శేఖర్, ఎమ్మెల్సీ సంజీవ్‌సింగ్‌లు తమ చేరికను ధ్రువపరస్తూ శాసనసభ స్పీకర్ విజయకుమార్ చౌదరి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ హరూన్ రషీద్‌కి ఆదివారం లేఖలు పంపినట్లు తెలిసింది. తమ చేరికను అనుమతిస్తున్నట్లుగా జేడీయూ నుంచి సైతం వారు లేఖను అందజేసినట్లుగా తెలిసింది. -
శివసేన గూటికి చతుర్వేది
న్యూఢిల్లీ/ముంబై: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది శుక్రవారం ఆ పార్టీని వీడారు. ఆ వెంటనే ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో శివసేన పార్టీలో చేరారు. చతుర్వేది కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి, వివిధ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీకి పంపారు. ఆమె పార్టీ అధికార ప్రతినిధిగా, మీడియా విభాగం ఇన్‌చార్జీగా కొనసాగుతున్నారు. పార్టీలో కొందరు నాయకులు తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని, కొద్ది వారాలుగా తనకు అవమానాలు జరుగుతున్నాయని ఆమె కొద్దిరోజుల క్రితం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిని అధిష్టానం సస్పెండ్ కూడా చేసింది. అయితే, ఆ పార్టీ పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఇన్చార్జి జ్యోతిరాదిత్య జోక్యంతో ఇటీవల వారిని మళ్లీ పార్టీలోకి తీసుకున్నారు. దీంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌లో తన సేవలకు విలువలేదని, అందుకే పార్టీని వీడుతున్నానని రాహుల్‌ను ఉద్దేశించి ఒక లేఖ రాశారు. ప్రియాంక చతుర్వేదిని ఉద్దేశించి ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ శివసేన కార్యకర్తలకు మంచి సోదరి లభించిందని అన్నారు. తన స్వస్థలం ముంబై అని, అందుకే శివసేనలో చేరానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మహిళలకు రక్షణలేదని బీజేపీ అధికార ప్రతినిధి అన్నారు. -
కాంగ్రెస్‌లో చేరిన నటి ఊర్మిళ
న్యూఢిల్లీ: సినీనటి ఊర్మిళ మటోండ్కర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. రాహుల్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ‘కాంగ్రెస్ భావజాలంపై నమ్మకంతోనే ఇందులో చేరాను. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేరలేదు’ అని ఊర్మిళ అన్నారు. కాగా, ఊర్మిళ ఉత్తర ముంబైలోని లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. -
బాబు మోసాలను ప్రజలకు తెలియజేయండి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): సీఎం చంద్రబాబునాయుడు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని వైఎస్సార్సీపీ నందికొట్కూరు, కర్నూలు ఇన్చార్జులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, హఫీజ్‌ఖాన్, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు సూచించారు. ఎస్ఎఫ్ఐ నందికొట్కూరు డివిజన్ అధ్యక్షుడు దిలీప్‌తో పాటు నందికొట్కూరు, కర్నూలు నియోజకవర్గాలకు చెందిన 200 మంది విద్యార్థులు శనివారం వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ కార్యాలయంలో వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. ఈసందర్భంగా సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు విద్యార్థి, యువతను మోసం చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారంటే యువతకు ఇస్తున్న ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ విజయం కోసం పనిచేయాలన్నారు. అందులోభాగంగా చంద్రబాబు మోసాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించాలన్నారు. హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి యువత అండగా నిలవాలన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టే నవరత్నాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. సలాంబాబు మాట్లాడుతూ.. నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రత్యేక హోదా డిమాండ్‌ను సజీవంగా ఉంచిన జగన్మోహన్రెడ్డి వెంట యువత నడిచేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ అదనపు రాష్ట్ర కార్యదర్శులు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, చెరకుచెర్ల రఘురామయ్య, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి, కర్నూలు, నంద్యాల విద్యార్థి విభాగాల జిల్లా అధ్యక్షులు కోనేటి వెంకటేశ్వర్లు, సాయిరామ్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కిమి అనుమంతరెడ్డి, రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు ప్రశాంత్, నాయకులు నవీన్, వై.రాజశేఖరరెడ్డి, యశశ్వని పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన గంజెళ్ల నాయకులు
ఎమ్మిగనూరు రూరల్ : గోనెగండ్ల మండలం గంజెళ్ల గ్రామానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆ పార్టీలకు గుడ్‌బై చెప్పారు. ప్రజల పట్ల అంకిత భావం చూపే వైఎస్. జగన్ నాయకత్వం, ప్రత్యేక హోదా కోసం పోరాడే పార్టీ నికర వైఖరి పట్ల తామంతా ఆకర్షితులమై మేము సైతం పార్టీకి అండగా నిలవాలని ముందుకు కదిలామంటూ ముక్తకంఠంతో నినదించారు. మంగళవారం ఎంపీపీ నసురుద్దీన్, తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశరెడ్డి సమక్షంలో వీరంతా వైఎస్సార్సీపీలో లాంఛనంగా చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన వంద మంది నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ పోరాటాలను గుర్తించి అండగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఆ పార్టీల విధానాలు, వైఖరులు నచ్చకే వీరంతా పార్టీలో చేరారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదు కోట్ల మందిని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబునాయుడు పూటకోమాట మార్చుతూ నాటకాలు ఆడుతున్నాడని, చిత్తశుద్ధి ఉంటే తన పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా విషయంలో నాలుగేళ్ల నుంచి మాటతప్పకుండా ఒకే మాటమీద నిలబడి నికరంగా పోరాటం చేస్తోంది వైఎస్సార్సీపీ మాత్రమేనని చెప్పారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై ప్రజలకు అపార నమ్మకం ఉందని, పాదయాత్రల సందర్భంగా ఎక్కడికి వెళ్లినా వేలాది మంది ఆయనను అనుసరించడమే అందుకు నిదర్శనమన్నారు. అధికారంలోకి వస్తే తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కంటే మంచి పాలన అందించి చరిత్ర సృష్టిస్తారని స్పష్టం చేశారు. రాబోయే సుపరిపాలన కోసం మనమంతా సైనికుల్లా పనిచేసి వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేసేవరకు శ్రమించాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన నాయకులు అంకిత భావతంతో పనిచేయాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో వెంకట్రాముడు, శాంతన్న, మల్లేష్, శ్రీనివాసులు, రంగస్వామి, గోపాల్, యంకన్న, చంద్ర, పెద్దయ్య, నాయుడు, గోరిల్లా, రాఘవేంద్ర, నాగార్జున, జయరాముడు, ఉరుకుందు, విజయ్, నాగరాజు, కృష్ణ, బారికి పరమేష్‌లతో పాటు మరి కొందరు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బీఆర్ బసిరెడ్డి, ధర్మకారి నాగేశ్వరరావు, బందెనవాజ్ తదితరులు ఉన్నారు. -
అభివృద్ధిని చూసే పార్టీలోకి..
ఆసిఫాబాద్‌క్రైం : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే తమ పార్టీలోకి వస్తున్నారని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో వాంకిడి మండలంలోని కనర్గాం గ్రామానికి చెందిన ప్రజలను ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ విధానాలు మెచ్చి పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని వాపోయారు. గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్‌రావు, రెబ్బన ఎంపీపీ సంజీవ్, ఎంపీటీసీ రవీందర్, నాయకులు గాదవేణి మల్లేశ్, సుదర్శన్‌గౌడ్, జాడి రేణుక బాయి, రాజు బాయి, నందు, కిరణ్, జీవన్ తదితరులున్నారు. -
కొండా రాఘవరెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిక
ఖమ్మం : వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఖమ్మం జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి సమక్షంలో ఖమ్మం నగరానికి చెందిన నాయకులు తుమ్మా అప్పిరెడ్డితోపాటు పలువురు హైదరాబాద్‌లో సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో రాఘవరెడ్డి.. జిల్లా నాయకులు తుమ్మా అప్పిరెడ్డి, కొవ్వూరి శ్రీనివాస్, ఆదోని రాజవర్ధన్‌రెడ్డి, కత్తి శ్రీను, ఎస్.కృష్ణారెడ్డి తదితరులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ వైఎస్సార్ పేదల అభివృద్ధి కోసం నిత్యం పరితపించేవారని, ఆయన ఆశయ సాధన కోసం ఆవిర్భవించిన పార్టీలో చేరడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మందడపు వెంకటరామిరెడ్డి, ఆలస్యం సుధాకర్, మందడపు వెంకటేశ్వరరావు, ఆలూరి సత్యనారాయణ, కరీం, రమణ తదితరులు పాల్గొన్నారు.