ఆర్మీలో 575 మంది కశ్మీర్‌ యువకులు | 575 Jammu Kashmir youths join Indian Army after revocation of Article 370 | Sakshi
Sakshi News home page

ఆర్మీలో 575 మంది కశ్మీర్‌ యువకులు

Published Sun, Sep 1 2019 4:28 AM | Last Updated on Sun, Sep 1 2019 4:28 AM

575 Jammu Kashmir youths join Indian Army after revocation of Article 370 - Sakshi

పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో సైనికులు

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌ చెందిన 575 మంది యువకులు భారత సైన్యంలో చేరారు. వారు ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం స్థానిక బానా సింగ్‌ మైదానంలో పరేడ్‌ నిర్వహించారు.  జమ్మూ కశ్మీర్‌ లైట్‌ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌లో పని చేసేందుకు వీరిని నియమించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. లెఫ్టినెంట్‌ జనరల్‌ అశ్వనీ కుమార్‌ ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. దేశానికి సేవ చేయాలనే తపన కశ్మీర్‌ యువకుల్లో కనపడిందని ఆయన తెలిపారు.  తమ కుమారులు ఆర్మీలో పని చేయడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా కొందరు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement