నేటి నుంచి లేపాక్షి ఉత్సవాలు ప్రారంభం | Lepakshi festival starts today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి లేపాక్షి ఉత్సవాలు ప్రారంభం

Published Sat, Feb 27 2016 8:44 AM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM

Lepakshi festival starts today

అనంతపురం : అనంతపురం జిల్లా హిందూపురంలో లేపాక్షి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించనున్నారు. ఈ ఉత్సవాలకు కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి హాజరుకానున్నారు. లేపాక్షి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం 999 మంది కళాకారులతో శోభాయాత్రను నిర్వహించనున్నారు. లేపాక్షి ఉత్సవ ఏర్పాట్లను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఇప్పటికే ఈ ఉత్సవాలకు హాజరుకావాలంటూ  నందమూరి బాలకృష్ణ న్యూఢిల్లీలోని పలువురు కేంద్రమంత్రులను కలసి స్వయంగా ఆహ్వాన పత్రాలు అందజేసిన సంగతి తెలిసిందే.  ఈ ఉత్సవాలకు ఏపీ ప్రభుత్వం రూ. 4.20 కోట్ల నిధులు కేటాయించిన విషయం విదితమే. లేపాక్షి ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement