
అవయవదానం చేసిన రూప్‌కుమార్
పంజగుట్ట: విజయవాడలో బ్రైయిన్ డెడ్ అయిని బాలుడి కాలేయం నగరానికి తరలించారు. నిమ్స్ జీవన్ దాన్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం ... విజయవాడకు చెందిన రూప్‌కుమార్ (13) అక్కడి ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. రూప్‌కుమార్ ఈనెల 24న పాఠశాలలో ఆడుకుంటుడగా తోటి విద్యార్ది కాలు తగిలి బెంచ్‌పై పడ్డాడు.
అతని తలకు బలమైన దెబ్బతగిలింది. తల్లి విజయవాడ సన్ షైన్ ఆసుపత్రికి తరలించింది. 25న వైద్యులు రూప్‌కుమార్‌కు బ్రైయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. జీవన్ దాన్ ప్రతినిధులు అతని తల్లిదండ్రులు శివరామకృష్ణ, తల్లి సునీతలకు అవయవదానం గురించి వివరించారు. వారు ఒప్పుకోవడంతో శస్త్రచికిత్స చేసి బాలుడి 2 కిడ్నీలు, కాలేయం, కళ్లు సేకరించారు. కిడ్నీలు, కళ్లు విజయవాడలోని వివిధ ఆసుపత్రులకు తరలించగా కాలేయంను బుధవారం ఉదయం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు.
విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో అంబులెన్స్ లో కాలేయాన్ని తీసుకువస్తుండగా ఎక్కడికక్కడ పోలీసులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా చూశారు...