ఘనంగా దేవీ నిమజ్జనం | lord durga idols immersed peacefully | Sakshi
Sakshi News home page

ఘనంగా దేవీ నిమజ్జనం

Published Sat, Oct 15 2016 8:39 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

lord durga idols immersed peacefully

మహబూబాబాద్‌‌: పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కొలువుదీరిన దుర్గాదేవి అమ్మవార్ల నిమజ్జనం సందర్భంగా బుధవారం రాత్రి అమ్మవార్ల ఊరేగింపులు ఆయా ఉత్సవకమిటీల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. వాసవి సేవా ట్రస్ట్‌ మహబూబాబాద్‌ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో దేవీశరన్నవరాత్సోవాల సందర్భంగా పూజలందుకున్న దుర్గామాతను భద్రాచలంలోని గోదావరినదిలో గురువారం ఉదయం నిమజ్జనం చేశారు.

అనంతరం భక్తులు సీతారామచంద్రస్వామివారి దేవాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహణాధికారి ఒబిలిశెట్టి రామకృష్ణ, కొత్త సోమన్న, సోమ శ్రీనివాస్, కందిమల్ల జగత్,  నర్సింహస్వామి, కల్పన, మౌనిక, ఉమారాణి, రమాదేవి, అఖిల్, సురేష్, ఒబిలిశెట్టి రవికుమార్, గోపురాము, నాగమల్ల నరేష్,  మారెపల్లి కౌశిక్, శివనాథుల శ్రీనివాస్, వెలిశాల భద్రీనాథ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement