నష్టాల పోటు
నష్టాల పోటు
Published Tue, Feb 14 2017 12:38 AM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పట్టిసీమ ప్రాజెక్ట్ నిర్మించి కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేస్తున్నట్టు అధికార పార్టీ నేతలు చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. కృష్ణా డెల్టా పరిధిలో గల ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లోని ఆయకట్టుకు నీరందని దుస్థితి నెలకొంది. సాగునీరు లేక ఈ ప్రాంత రైతులు ఆరుతడి పంటలైన మినుము, పెసర వేసి నష్టాల బారిన పడ్డారు. గత ఏడాది ఖరీఫ్‌లో ³Nర్తిగా నష్టపోయిన రైతులు ఈసారి అపరాల పంట వైపు మొగ్గుచూపారు. తెగుళ్లు సోకడంతో ఈ పంట కూడా చేతికి అందకుండా పోయింది.
చుక్క నీరిస్తే ఒట్టు
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించగా.. ఆ డెల్టా పరిధిలోని ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో ఆయకట్టుకు చుక్కనీరు కూడా అందలేదు. ఖరీఫ్‌లోనూ దాదాపు 30 వేల ఎకరాల్లో పంటలు వేయలేని పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రస్తుత సీజ¯ŒSలో రైతులు మినుము, పెసర సాగు చేశారు. కాలం కలిసిరాకపోవడంతో ఏలూరు, దెందులూరు, పెదపాడు మండలాల్లో 50 వేలకు పైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైరస్ (మొవ్వకుళ్లు తెగులు) సోకి పంట మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఎకరాకు రూ.12 వేల నుంచి రూ.15 వరకూ పెట్టుబడి పెట్టగా.. చేతికి చిల్లిగవ్వ కూడా దక్కే పరిస్థితి లేదు. పెద్దనోట్ల రద్దు వల్ల ఈసారి రైతులకు పంట రుణాలు కూడా అందలేదు. వడ్డీ వ్యాపారుల నుంచి సొమ్ము సమకూర్చుకుని పెట్టుబడి పెట్టిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను తట్టకునే విత్తనాలు అందించడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది. తెగులు నివారణకు మందులు వాడాలో కనీస సమచారం కూడా వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు ఇవ్వలేదు. అసలు ఏ తెగులు వచ్చిందో కూడా నిర్థారణ చేయలేకపోయారు. పంట నాశనమైన తర్వాత అధికారులు పొలాల చుట్టూ తిరగడం వల్ల పెద్దగా ప్రయోజనం లేకుండాపోయింది. పురుగుమందులు పిచికారీ చేసేందుకు కూడా పంట కాలువల్లో నీరు లేకపోవడంతో ఆటోలు, రిక్షాలపై డ్రమ్ముల్లో నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతుల దుస్థితిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చి సరిపెట్టారు. తీవ్రంగా నష్టపోయామని రైతులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పంట పూర్తిగా దెబ్బతినడంతో గొర్రెల మేత కోసం పొలాలను వదిలివేయాల్సి వచ్చింది. తమకు నష్టపరిహారం ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుండగా, పంట నష్టపోయిన రైతులను వెంటనే గుర్తించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. కౌలు రైతులు సోమవారం ఆయనను కలిసి పంట నష్టాల గురించి వివరించారు. వెంటనే వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్‌ను పిలిపించిన కలెక్టర్ ఎన్యుమరేష¯ŒS చేపట్టాలని ఆదేశించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాను 15 రోజుల క్రితమే ఈ పరిస్థితిని వివరించినా అధికారులు స్పందించలేదని, అందుకే రైతులు రోడ్డెక్కాల్సిన వచ్చిందంటూ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
నష్టపరిహారం చెల్లించండి
జిల్లాలో తెగుళ్ల వల్ల అపరాల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కౌలురైతు సంఘం కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నష్టాన్ని అంచనా వేయించి ఎకరానికి రూ.15 వేల చొప్పున చెల్లించాలని కోరారు.
Advertisement
Advertisement