ఖమ్మం: డాబా పై నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా వైరా బ్రాహ్మణపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కన్నెగంటి చిన్న శ్రీను(40) డాబా ఎక్కుతున్న సమయంలో ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా.. అప్పటికే ఆయన మృతిచెందాడు.