ఆ ఫోటోలను నెట్లో పెడతానంటూ... | Man rapes girl blackmailing her photos put in internet | Sakshi
Sakshi News home page

ఆ ఫోటోలను నెట్లో పెడతానంటూ...

Published Tue, Jul 5 2016 10:41 PM | Last Updated on Wed, Sep 26 2018 6:32 PM

ఆ ఫోటోలను నెట్లో పెడతానంటూ... - Sakshi

ఆ ఫోటోలను నెట్లో పెడతానంటూ...

‘నీ అర్ధనగ్న ఫొటోలు నా వద్ద ఉన్నాయి.. చెప్పినట్లు వినకుంటే ఫొటోలు నెట్‌లో పెడతా’..అంటూ బెదిరించి బాలికపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతని వేధింపులు తాళలేని బాధితురాలు నిద్రమాత్రలు మింగింది.

నెల్లూరు క్రైం: ‘నీ అర్ధనగ్న ఫొటోలు నా వద్ద ఉన్నాయి.. చెప్పినట్లు వినకుంటే ఫొటోలు నెట్‌లో పెడతా’..అంటూ బెదిరించి బాలికపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతని వేధింపులు తాళలేని బాధితురాలు నిద్రమాత్రలు మింగింది. ఈ సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరులోని నీలగిరి సంఘానికి చెందిన ఓ బాలిక పాలిటెక్నిక్ డిప్లొమో సెకండియర్ చదువుతోంది. ఆమె ఇంటి ముందు నివాసం ఉండే ఉడతా సురేష్‌కు భార్య, ఎనిమిదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అతడు బాలికను ప్రేమిస్తున్నానంటూ కొన్ని నెలలుగా వెంటపడుతున్నాడు. బాధితురాలు తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సురేష్ కుటుంబసభ్యుల హామీ మేరకు కేసు ఉపసంహరించుకొన్నారు. అయినా, అతని ప్రవర్తనలో మార్పురాలేదు. బాలిక కళాశాలకు వెళుతుండగా వెంటబడేవాడు.

ఆమెకు అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టడంతో పాటు, ఆమె అర్ధ నగ్న ఫొటోలు తన వద్ద ఉన్నాయని.. వాటిని నెట్‌లో పెడతానని బాలికను బెదిరిస్తున్నాడు. తాను చెప్పినట్లు వినాలని బెదిరించి తన షాపునకు తీసుకెళ్లి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే ఆమెను, ఆమె తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడు. దీంతో బాలిక అతని వికృత చేష్టలను మౌనంగా భరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో బాలిక గర్భవతి కాగా అబార్షన్ పిల్స్ మింగించాడు. ఈ క్రమంలో ఈ నెల మూడోతేదీ సాయంత్రం నిద్రమాత్రలు మింగింది. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను బాధిత కుటుంబసభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆమె ఆస్పత్రిలో చికిత్స పొంది మంగళవారం తల్లిదండ్రుల సాయంతో నాలుగో నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్య నిందితుడిపై లైంగికదాడి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement