పామిడి : మండలంలోని పీ కొత్తపల్లిలో మంగళవారం ఉదయం అనుమానస్పదస్థితిలో ఎస్. శ్రీనివాసులుయాదవ్(48) అనే వ్యక్తి మృతి చెందారు. సోమవారం రాత్రి పామిడిలో జరిగిన విందు కార్యక్రమానికి శ్రీనివాసులు వెళ్లి వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం అతడు గురుకలు పెడతూ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు.
కుటుంబసభ్యులు ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆహారం విషతుల్యమై శ్రీనివాసులు మృతి చెంది ఉంటాడన్న అనుమానాన్ని కుటుంబసభ్యులు వ్యక్తం చేస్తున్నారు. అతడికి భార్య ఆదిలక్ష్మి, కుమారుడు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి
Published Tue, Nov 15 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM
Advertisement
Advertisement