మంజీరా జిల్లా ఏర్పాటు చేయాలి | Manjira district should be formed | Sakshi
Sakshi News home page

మంజీరా జిల్లా ఏర్పాటు చేయాలి

Published Wed, Sep 21 2016 8:04 PM | Last Updated on Thu, Apr 4 2019 5:45 PM

మాట్లాడుతున్న సంజీవరావు - Sakshi

మాట్లాడుతున్న సంజీవరావు

  • వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి సంజీవరావు
  • రేగోడ్: అందోల్‌ కేంద్రంగా మంజీరా జిల్లాను ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి సంజీవరావు డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజాభిప్రాయం మేరకే జిల్లాలు, మండలాల ఏర్పాటు చేస్తామని  సీఎం కేసీఆర్‌ చెబుతున్నా అందుకనుగుణంగా జరగటం లేదన్నారు.

    రాజకీయలబ్ధి కోసమే  పునర్విభజన చేస్తున్నారన్నారు. అందోల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్యెల్యేగా పనిచేసిన వారు అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు.  మంజీరా జిల్లాలో నియోజకవర్గంలోని ఏడు మండలాలతో పాటు నారాయణఖేడ్‌ నియోజకవర్గాన్ని కలపాలన్నారు. లేకుంటే ఈ ప్రాంత ప్రజలు, విద్యార్థులకు ఎంతో నష్టం జరుగుతోందన్నారు.

    పునర్విభజన సరిగా లేదంటూ నియోజకవర్గంలోని రేగోడ్, అల్లాదుర్గం వంటి మండలాల్లో నిరాహార దీక్షలు  కొనసాగుతున్నాయన్నారు. వెనుకబడిన ప్రాంతమైన అందోల్‌ను మంజీరా జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement