sanjeevarao
-
ఎమ్మెల్యే కారు ఢీకొని వృద్ధురాలికి గాయాలు
బంట్వారం(వికారాబాద్ జిల్లా): వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు కారు ఢీకొని మనెమ్మ అనే వృద్ధురాలికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన బ్వంటారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు వికారాబాద్ ఎమ్మెల్యే కారు ధ్వంసం చేశారు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత వృద్ధురాలిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. -
మంజీరా జిల్లా ఏర్పాటు చేయాలి
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి సంజీవరావు రేగోడ్: అందోల్ కేంద్రంగా మంజీరా జిల్లాను ఏర్పాటు చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి సంజీవరావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజాభిప్రాయం మేరకే జిల్లాలు, మండలాల ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ చెబుతున్నా అందుకనుగుణంగా జరగటం లేదన్నారు. రాజకీయలబ్ధి కోసమే పునర్విభజన చేస్తున్నారన్నారు. అందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్యెల్యేగా పనిచేసిన వారు అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. మంజీరా జిల్లాలో నియోజకవర్గంలోని ఏడు మండలాలతో పాటు నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని కలపాలన్నారు. లేకుంటే ఈ ప్రాంత ప్రజలు, విద్యార్థులకు ఎంతో నష్టం జరుగుతోందన్నారు. పునర్విభజన సరిగా లేదంటూ నియోజకవర్గంలోని రేగోడ్, అల్లాదుర్గం వంటి మండలాల్లో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయన్నారు. వెనుకబడిన ప్రాంతమైన అందోల్‌ను మంజీరా జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. -
సిద్దిపేట, గజ్వేల్‌కేనా సీఎం?
అల్లాదుర్గం: కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రా? కేవలం గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలకేనా అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి సంజీవరావు ప్రశ్నించారు. మంగళవారం స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాలను అభివృద్ధి చేయాల్సిన సీఎం, మంత్రులు గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలకే వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నారని విమర్శించారు. ఇతర నియోజక వర్గాల అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తన్నారని ఆరోపించారు. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు సక్రమంగా లేదని మండిపడ్డారు. అందోల్ నియోజకవర్గాన్ని రెండు ముక్కలు చేసిన ఎమ్మెల్యే బాబూమోహన్ నోరు మెదపడం లేదన్నారు. ప్రజల ఇబ్బందులకు పట్టించుకోకుండా డబ్బు మూటలు దాచుకొవడమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారని ఆరోపించారు. -
ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి బి.సంజీవరావు జోగిపేట : కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి నిర్వహించిన అఖిలపక్ష కమిటీ సమావేశానికి వైఎస్ఆర్సీపీని రాష్ట్ర ప్రభుత్వం భయపడే ఆహ్వానించలేదని, కేసీఆర్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని ఆ పార్టీ రాష్ర్ట కార్యదర్శి బి.సంజీవరావు అన్నారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఫోన్లో సాక్షితో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం వైఎస్ఆర్సీపీని జాతీయ పార్టీగా గుర్తించిందన్నారు. సమావేశానికి పిలిస్తే వాస్తవాలను తెలుసుకుని ప్రజల చెబుతారనే భయంతో పిలవలేదన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ లక్షల ఓట్లు సాధించిందన్నారు. రాబోయే రోజుల్లో దివంగత నేత వైఎస్ఆర్ అభిమానులు టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ర్టంలో లక్షలాది మంది ప్రజల గుండెల్లో దివంగత నేత వైఎస్ఆర్ ఉన్నారన్న విషయాన్ని మరవొద్దన్నారు. గత సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున నలుగురు శాసనసభ్యులు, ఎంపీ గెలిచిన విషయాన్ని ప్రభుత్వం మరచిందన్నారు. వచ్చే ఎన్నికల వరకు రాష్ట్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తామన్నారు. రాష్ర్టంలో ప్రతిపక్షపార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీని ఆహ్వానించకపోవడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. -
ఏసీబీ వలలో హౌసింగ్ చేప
వర్గల్, న్యూస్‌లైన్ : ఏసీబీ అధికారులు మారో లంచావతారాన్ని పట్టేశారు. ఓ లబ్ధిదారున్నుంచి రూ,10 వేలు తీసుకున్న హౌసింగ్ ఇన్స్పెక్టర్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. గృహ నిర్మాణ శాఖలో అవినీతికి పరాకాష్టగా నిలిచిన ఈ సంఘటన మండలంలో కలకలం రేపింది. ఏసీబీ డీఎస్పీ సంజీవరావు విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం...వర్గల్ మండలం మాదారం గ్రామానికి చెందిన ఎర్ర సత్తమ్మకు రచ్చబండ ద్వారా ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఈ మేరకు ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారు సత్తమ్మ కుమారుడు మల్లేశం ఇంటి బిల్లు కోసం వర్గల్ మండల హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ వి.కొండల్‌రెడ్డిని సంప్రదించాడు. మొత్తం నాలుగు దఫాలుగా ఇచ్చే ఇంటి బిల్లు రూ.90 వేలుఒకేసారి ఇచ్చేందుకు వర్క్ ఇన్స్పెక్టర్ కొండల్‌రెడ్డి రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సత్తమ్మ కొడుకు మల్లేశం ఆయన్ను బతిమిలాడి చివరకు రూ.10 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కొండల్‌రెడ్డి సూచన మేరకు ఆ మొత్తాన్ని బుధవారం నాచారంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) వద్ద ఇస్తానని తెలిపాడు. అనంతరం ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు చేరవేసిన మల్లేశం, వారి సూచనలకు అనుగుణంగా బుధవారం తల్లి సత్తమ్మతో కలిసి ఉదయం 9 గంటలకు బ్యాంకు వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఏసీబీ అధికారులు ఇచ్చిన రూ.10 వేలను హౌసింగ్ వర్క్ఇన్స్పెక్టర్కు లంచంగా ఇచ్చేందుకు జేబులో భద్రపరచుకున్నాడు. ఒంటి గంట ప్రాంతంలో బ్యాంకుకు చేరుకున్న కొండల్‌రెడ్డి లబ్ధిదారు సత్తమ్మ, ఆమె కొడుకు మల్లేశంను బ్యాంకులోకి తీసుకెళ్లాడు. తన వద్ద ఉన్న సత్తమ్మ పాసు బుక్కును అక్కడి బ్యాంకు అధికారులకు చూపించి అందులోనుంచి బిల్లు మొత్తాన్ని దాదాపు రూ.90 వేలు లబ్ధిదారు సత్తమ్మకు ఇప్పించాడు. బ్యాంకు వెలుపలికి రాగానే మల్లేశం ఇచ్చిన రూ.10 వేలను తీసుకున్న వర్క్ ఇన్స్పెక్టర్ కొండల్‌రెడ్డి తన జేబులో పెట్టుకున్నాడు. ఈ సమయంలో అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడిచేసి నిందితున్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఇతర గృహ నిర్మాణ లబ్ధిదారులకు చెందిన బ్యాంకు పుస్తకాలు స్వాధీనం చేసుకుని నిందితుని అరెస్ట్ చేశారు. బ్యాంకులో డబ్బులు డ్రా చేసే సమయంలో ఏసీబీకి చిక్కకుండా లబ్ధిదారుల నుంచి లంచం సొమ్ము స్వీకరించేందుకు వర్క్ ఇన్స్పెక్టర్ పాస్‌పుస్తకాలు తన వద్దనే ఉంచుకోవడం ఆశ్చర్యపరుస్తోందని ఏసీబీ డీఎస్పీ సంజీవరావు పేర్కొన్నారు. లంచం తీసుకుంటూ దొరికిపోయిన కొండల్‌రెడ్డిని గురువారం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. అవినీతి అడ్డుకునేందుకు ప్రజలు మరింత చైతన్యవంతులు కావాలని, ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 9440446155 నంబర్‌కు సమాచారమివ్వాలని ఆయన సూచించారు.