గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య | men suicide at godavari rever | Sakshi
Sakshi News home page

గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య

Published Wed, Aug 31 2016 11:28 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య

గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య

  • రాజమహేంద్రవరం క్రైం :   తండ్రి మందలించాడని మనస్ధాపంతో గోదావరిలోకి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవిచౌక్‌కు చెందిన కందగడ్డల సాయి మణికంఠ పుల్లేశ్వరరావు(22) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మణికంఠ తండ్రి బ్రహ్మజీ రావు వ్యాపారం చేస్తుంటారు. ఇటీవల పుల్లేశ్వరరావు అక్కకు వివాహం చేశారు. అయితే మంగళవారం వివాహానికి అయిన ఖర్చుల విషయంలో తల్లి దండ్రుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో అగ్రహం వ్యక్తం చేసిన తండ్రి బ్రహ్మాజీరావు కుమారుడు మణికంఠ పుల్లేశ్వరరావును ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. దీంతో మనస్ధాపానికి గురైన పుల్లేశ్వరరావు మంగళవారం మ«ధ్యాహ్నం  ఇంటి నుంచి  బయటకు వెళ్ళిపోయి తల్లికి ఫోన్‌ చేసి తాను గోదావరిలోకి దూకి  ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పాడు. కొడుకు తమను భయ పెట్టడానికి చెబుతున్నాడని అనుకున్న తల్లిదండ్రులు ఆ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే రాత్రికి ఇంటికి చేరకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు వెంటనే  బ్రిడ్జి పైకి వెళ్ళిచూడగా మణికంఠ వేసుకువెళ్ళిన మోటారు సైకిల్, సెల్‌ఫోన్‌ను గుర్తించారు. బుధవారం మృతదేహం కోసం గాలించగా సాయంత్రానికి  లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికు తరలించారు. టూ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
  • కుమారుడి మృతితో శోక సముద్రంలో కుటుంబం...
    ఇంటికి ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఐదు రోజుల క్రితం కుమార్తె పెళ్ళి చేసిన ఆ కుటుంబంలో అనుకోని సంఘటనతో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు కన్నిరుమున్నీరుగా విలపించడం స్ధానికులను కంటతడి పెట్టించింది. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement