men suicide
-
భార్యకు వైద్యం చేయించలేక రైతు ఆత్మహత్య
మైదుకూరు రూరల్: అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యకు వైద్యం చేయించలేని నిస్సహాయ స్థితిలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మైదుకూరు మండలం పోతిరెడ్డిపల్లె గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మూలె శ్రీరామ్‌రెడ్డి (59) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ నేపథ్యంలో అతని భార్య రాములమ్మకు క్యాన్సర్ వ్యాధి రావడంతో నాలుగేళ్ల క్రితం రూ.4 లక్షలు అప్పు చేసి వైద్యం చేయించాడు. అయినా వ్యాధి తగ్గకపోవడంతో గురువారం చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాల్సి ఉండింది. మళ్లీ లక్షలు అప్పు చేసి వైద్యం చేయించే స్థోమత లేక.. ముందు చేసిన అప్పులే తీర్చలేక తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ఈ పరిస్థితిలో మంగళవారం ఉదయం తన పొలం వద్దకు వెళ్లి నీటిలో విషపు గుళికలు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి భార్య కన్నీరు మున్నీరవుతుంటే ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉండగా, వీరిలో ఇద్దరు కుమారులు, కూతురికి వివాహమైంది. మూడో కుమారుడు రామమోహన్‌రెడ్డి వ్యవసాయంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. -
భార్యను చంపలేకపోయానన్న కోపంతో తానే..
సాక్షి, విజయవాడ : నగరంలోని సింగ్‌నగర్ వాంబే కాలనీలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. కాలనీలోని బ్లాక్‌లో నివసిస్తున్న అప్పారావు అనే వ్యక్తి భార్యతో గొడవపడి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. మృతుడు అప్పారావు సింగ్‌నగర్ కాలనీలో వ్యాపారం చేస్తుండగా, గత కొంత కాలంగా భార్యతో గొడవలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో అర్థరాత్రి సమయంలో భార్యతో మరోసారి గొడవపడిన అప్పారావు, పథకం ప్రకారం బాటిల్లో తెచ్చుకున్న పెట్రోల్‌ని భార్యపై పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. భార్య కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి అప్పారావుని తీవ్రస్థాయిలో మందలించారు. ఈ గొడవ సద్దుమణిగిన తర్వాత తెల్లవారుజామున అప్పారావు తాను ఉండే ప్లాటులోనే మిగిలిన పెట్రోల్ తనమీద పోసుకొని నిప్పంటించుకున్నాడు. విషయం తెలుసుకొని చుట్టుపక్కల వాళ్లు వచ్చి మంటలు ఆర్పగా, అప్పటికే కాలిన గాయాలతో అప్పారావు మృతిచెందాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న గ్రామీణ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. -
హత్యా.. ఆత్మహత్యా?
ఖిల్లాఘనపురం (వనపర్తి): వాగులో స్నానానికి వెళ్లిన ఓ మహిళ ప్రమాదవశాత్తు నీటిగుంటలో పడి మృతిచెందింది. ఈ సంఘటన మండలంలోని మల్కిమియాన్పల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోవర్ధన్‌రెడ్డి అదే గ్రామానికి చెందిన శిల్ప (28) (సిరాతిబేగం, కల్పన) ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. గురువారం తోడికోడళ్లు, పల్లవి, బావ వెంకట్‌రెడ్డి, కుటుంబ సభ్యులు మమత, తేజస్విని, ఆంజనేయులు, యాదమ్మతో కలిసి పొలం దగ్గరకు వెళ్లింది. అయితే పొలానికి సమీపంలో పెద్ద వాగు పారుతుండగా అందరూ కలిసి అక్కడే స్నానం చేశారు. ఈ సమయంలో శిల్ప ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న నీటి గుంతలోకి జారిపోయింది. గమనించిన పల్లవి, మమత ఆమెను రక్షించే ప్రయత్నంలో అందరూ వాగులో పడిపోయారు. సమీపంలో ఉన్న శ్రీనివాసరెడ్డి, వెంకట్‌రెడ్డి వచ్చి వాగులోకి దూకి కనిపించిన వారందరిని పైకి లాగారు. శిల్ప కనిపించకపోవడంతో నీటిగుంతలో వెతికారు. చివరికి ఆమె కాళ్లకు తగలడంతో మునిగి పైకి తీశారు. శ్వాస తీయడం ఇబ్బందిగా ఉండటంతో ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా శిల్పను గోవర్ధన్‌రెడ్డి కుటుంబ సభ్యులు కొట్టిచంపి నీటి గుంటలో పడేశారని ఆమె మృతిపై తమకు అనుమానం ఉందని బంధువులు ఆరోపించారు. శిల్ప చిన్నమ్మ గోరెబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శిల్ప కుటుంబ సభ్యులను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి పరామర్శించారు. చిన్నారులు చదువుకోవడానికి తనవంతుగా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. -
రుణ‘పాశం’
అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య వడ్డీ వ్యాపారుల వేధింపుల వల్లేనని సూసైడ్ నోట్ అంబాజీపేట : తాహతుకు మించి చేసిన అప్పులు ఆ యువకుడినే బలిగొన్నాయి. జీవితంలో స్థిరపడేందుకు అక్కరకు వస్తుందనుకున్న రుణమే.. అతడి పాలిట యమపాశమైంది. స్థానిక పెద్దవీధికి చెందిన సిరిపెల్ల నాగవెంకట సతీష్‌కుమార్(25) సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం అతడి బంధువు ఇంట్లోకి వెళ్లిచూడగా, ఫ్యాన్ హుక్కుకు మృతదేహం వేలాడుతూ కనిపించింది. అమలాపురం రూరల్ సీఐ జి.దేవకుమార్, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొంతకాలంగా సతీష్‌కుమార్ అంబాజీపేట సెంటర్ సమీపంలో ఇంటర్నెట్ కేంద్రం నిర్వహిస్తున్నాడు. తన కుటుంబ సభ్యులకు తెలియకుండా కొందరి వద్ద రూ.10 లక్షలు పైబడి వడ్డీకి అప్పులు చేశాడు. అసలుకు వడ్డీ ఎక్కువ కావడంతో అప్పులు తీర్చలేకపోయాడు. దీంతో అప్పులు ఇచ్చినవారు అతడి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో అతడి తండ్రి రాంబాబుపై గత నెల 16న దాడి చేసి, గాయపరిచారు. ఈ సంఘటనపై అప్పట్లో రాంబాబు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అలాగే వడ్డీ వ్యాపారులు కూడా సతీష్‌కుమార్ తీరుపై ఫిర్యాదు చేశారు. దీంతో సతీష్‌కుమార్ పరారీలో ఉన్నాడు. తాను చేసిన అప్పులకు తన తండ్రిని కొట్టడంతో పాటు వడ్డీ వ్యాపారుల వేధింపులతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్ నోట్ పేర్కొని, ఉరి వేసుకున్నాడు. రాంబాబు ఫిర్యాదుతో పాటు సూసైడ్ నోట్ ఆధారంగా, దీంతో సంబంధం ఉన్న వారిపై కేసు నమోదు చేస్తున్నట్టు సీఐ దేవకుమార్ తెలిపారు. అల్లవరం ఎస్సై డి.ప్రశాంతకుమార్ సంఘటన స్ధలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య
రాజమహేంద్రవరం క్రైం : తండ్రి మందలించాడని మనస్ధాపంతో గోదావరిలోకి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవిచౌక్‌కు చెందిన కందగడ్డల సాయి మణికంఠ పుల్లేశ్వరరావు(22) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మణికంఠ తండ్రి బ్రహ్మజీ రావు వ్యాపారం చేస్తుంటారు. ఇటీవల పుల్లేశ్వరరావు అక్కకు వివాహం చేశారు. అయితే మంగళవారం వివాహానికి అయిన ఖర్చుల విషయంలో తల్లి దండ్రుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో అగ్రహం వ్యక్తం చేసిన తండ్రి బ్రహ్మాజీరావు కుమారుడు మణికంఠ పుల్లేశ్వరరావును ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. దీంతో మనస్ధాపానికి గురైన పుల్లేశ్వరరావు మంగళవారం మ«ధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి తల్లికి ఫోన్ చేసి తాను గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పాడు. కొడుకు తమను భయ పెట్టడానికి చెబుతున్నాడని అనుకున్న తల్లిదండ్రులు ఆ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే రాత్రికి ఇంటికి చేరకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు వెంటనే బ్రిడ్జి పైకి వెళ్ళిచూడగా మణికంఠ వేసుకువెళ్ళిన మోటారు సైకిల్, సెల్‌ఫోన్‌ను గుర్తించారు. బుధవారం మృతదేహం కోసం గాలించగా సాయంత్రానికి లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికు తరలించారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడి మృతితో శోక సముద్రంలో కుటుంబం... ఇంటికి ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఐదు రోజుల క్రితం కుమార్తె పెళ్ళి చేసిన ఆ కుటుంబంలో అనుకోని సంఘటనతో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు కన్నిరుమున్నీరుగా విలపించడం స్ధానికులను కంటతడి పెట్టించింది. -
యువకుడి ఆత్మహత్య
పిఠాపురం టౌన్ : బతుకు పోరాటంలో అలసిపోయాడు. జీవితంలో స్థిరపడాలనుకున్న అతడికి అడుగడుగునా ఎదురుదెబ్బలే తగిలాయి. ఇక ఎవరినీ నిందించడం ఇష్టంలేక తనువు చాలించాడు. జీవితంలో నిలదొక్కుకుంటానన్న నమ్మకం లేక, మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన పాలపర్తి వెంకట సత్యనారాయణ(27) కొంతకాలంగా స్థానిక ఈశ్వరనగర్లో అద్దెకు ఉన్నాడు. ఉప్పాడ రైల్వేగేటు సమీపంలో పాలు అమ్ముతూ జీవితం గడిపేవాడు. అంతకుముందు చాలాచోట్ల పనిచేసినప్పటికీ, ఎక్కడా నిలదొక్కుకోలేకపోయాడు. దాంతో షాపులో ఉన్న ఇనుపగొట్టానికి తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలంలో అతడు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జీవితంపై ఏ ఆశ లేకుండా ఇంతకాలం బతికానని, వ్యాపారంలో స్థిరపడదామనుకున్నా.. అది కూడా చేజారిపోయిందని అందులో సత్యనారాయణ పేర్కొన్నాడు. ఎవరినీ నిందించలేని పరిస్థితిలో, తన చేతకానితనం కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాశాడని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు. -
రైలు కింద పడి ఒకరు ఆత్మహత్య
సామర్లకోట: స్థానిక రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి రైలుకిందపడి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక రైల్వే పోలీసుల కథనం ప్రకారం పిఠాపురం అగ్రహారం ప్రాంతానికి చెందిన కొజ్జారపు లోవరాజు (35) తెల్లవారు జామున పిఠాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద విశాఖపట్నం వైపు Ðð ళ్లే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే హెచ్‌సీ గోవిందరావు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతోనే అతను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసిందన్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి హెచ్‌సీ గోవిందరావు దర్యాప్తు చేస్తున్నారు.