మాట్లాడుతున్న అంధవరపు వరహానరసింహం
శ్రీకాకుళం అర్బన్: వ్యాపారుల సంక్షేమమే లక్ష్యంగా చాంబర్ ఆఫ్ కామర్స్ పనిచేస్తుందని కామర్స్ అధ్యక్షుడు అంధవరపు వరాహ నరసింహం(వరం) అన్నారు. శ్రీకాకుళంలోని వరం రెసిడెన్సీలో శుక్రవారం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాపారులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా పని చేస్తామని తెలిపారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి పీవీ రమణ మాట్లాడుతూ వ్యాపారుల విశాల ప్రయోజనం కోసం ఏర్పడింనదన్నారు. జిల్లాలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటుకు ఎన్నో ఏళ్ల నుంచి శ్రమించామని చెప్పారు. ఆ కల ఇప్పటికి నెరవేరిందని అన్నారు. నెల క్రితం 46 సంఘాలతో చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పడిందన్నారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులూ ఉన్నారన్నారు. వ్యక్తుల మధ్య వైరం ఉంటే దాన్ని పక్కనపెట్టి చాంబర్ ఆఫ్ కామర్స్ అభివృద్దికి కృషి చేస్తామన్నారు. సంఘ ప్రతినిధి జామి భీమశంకరరావు‡ మాట్లాడుతూ 34ఏళ్ల క్రితం ఏర్పడాల్సిన చాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్నాళ్లకు ఏర్పడడం అభినందనీయమన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఒక గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేసి వ్యాపారుల సమస్యల కోసం కృషి చేస్తామన్నారు. త్వరలోనే మెంబర్‌షిప్, రిజిస్ట్రేషన్ కోసం కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పేర్ల సాంబమూర్తి, కోణార్క్ శ్రీను, మండవిల్లి రవి, పేర్ల మహేష్, గుమ్మా నాగరాజు, గుడ్ల మల్లేశ్వరరావు, తంగుడు నాగేవ్వరరావు, పాపారావు, బరాటం చంద్రశేఖర్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.