నేడు మిడ్‌మానేరు టెండర్ ఫైనల్..!
► టెండర్లు దాఖలు చేసిన రెండు వెంచర్లు
► పదేళ్ల ప్రాజెక్టు పనుల పోరాటానికి తెరపడేనా?
బోరుునపల్లి : మిడ్‌మానేరుకు పడ్డ గండి పూడ్చడంతో పాటు బ్యాలెన్‌స పనుల నిర్వహణకు ఈ నెల17న ఫైనల్ టెం డర్ ప్రైస్ బిడ్‌ను అధికారులు ప్రకటించనున్నారు. గత సెప్టెంబర్ 25న మిడ్‌మానేరుకు గండి పడడంతో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేసి అప్పటి వరకు ఎడమ వైపు పనులు నిర్వహిస్తున్న సంస్థల కాంట్రాక్టు రద్దు చేశారు. కొత్తగా రూ.323.45 కోట్ల అంచనాలతో మిడ్‌మానేరు ఇంజినీరింగ్ అధికారులు గత నెల 26న టెండర్లు పిలి చారు. నూతనంగా చేపట్టనున్న ప్రాజెక్టు పనులకు ఎస్‌ఆర్‌ఆర్‌సీ, ఎస్‌ఎంఎస్, బీఈకేఈఎం అనే ఉమ్మడి సంస్థ లు, ఎంఈఐఎల్, హెచ్‌ఈఎస్ అనే జారుుంట్ వెంచర్లు టెండర్లు దాఖలు చేశారుు. టెండర్‌ప్రైస్ బిడ్‌లో భాగం గా ఈనెల 16,17న టెండర్లు దాఖలు చేసిన జారుుంట్‌వెంచర్లకు సంబంధించిన సాంకేతిక అంశాలు ఇంజినీరింగ్ అధికారులు పరిశీలన చేస్తారు. సాంకేతిక పరంగా అర్హులైన సంస్థలను గుర్తించి ఈనెల 17న ఫైనల్ ప్రైస్ టెండర్ బిడ్ ప్రకటిస్తారు.
కొత్త ఎస్సెస్సార్ రేట్లతో పెరిగిన అంచనాలు
గండి పడిన నేపథ్యంలో మిగిలిన పనులకు సంబంధిచి కొత్త అంచనాలను నెల క్రితం నీటి పారుదల శాఖకు మి డ్‌మానేరు ప్రాజెక్టు అధికారులు సమర్పించారు. ప్రస్తుత పనులకు సుమారు రూ.134 కోట్లు ఖర్చు చేయాల్సి ఉం ది. అరుుతే కొత్త ఎస్సెస్సార్ (స్టాం డర్డ్ షెడ్యూల్ రేట్లు) రేట్లతో రూ. 134 కోట్ల పనులకు అదనంగా స గానికంటే ఎక్కువగా అంచనాలు పెరిగా రుు. దీంతో మొత్తం పనుల నిర్వహణకు రూ. 323.45 కోట్ల అంచనాలతో టెండర్లు పిలిచారు. కొత్త ఎస్సెస్సార్ రేట్లతో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆర్థిక భారం పడనుంది. ఇదే క్రమం లో కొత్త కాం ట్రాక్టర్‌కు పెరిగిన రేట్లు లాభం చేకుర్చనున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గతంలో కాంట్రాక్టు ప నులు పొందిన సంస్థలు లెస్‌కు టెం డర్లు పొందారుు. ఈసారి సంస్థలు ప్రభుత్వ అంచనాలకంటే లెస్‌కు చేస్తా యా.. ఎక్సెస్ రేట్లు కావాలంటాయా గురువారం తెలనుంది. కాగా ప్రాజెక్టు బ్యాలెన్‌స పనుల అంచనాలు పో ను, మిడ్‌మానేరుకు గండి పడడంతో , సుమారు రూ. 27కోట్లు అదనంగా అంచనాలు పెరిగా రుు. పదేళ్ల ప్రా జెక్టు పనుల పోరాటంలో ముచ్చటగా మూడోసారి ప్రకటించే టెండర్ పొందే సంస్థలు పూర్తి పనులు చేస్తాయో వేచి చూడాలి.