నేడు జిల్లాకు మంత్రి హరీశ్‌రావు
-
కేఎల్‌ఐ లిఫ్ట్–2, 3 ప్రారంభోత్సవం
-
గుడిపల్లి గట్టు వద్ద బహిరంగసభ
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు గురువారం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్–2ను ప్రారంభించనున్నారు. జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్‌ను ప్రారంభించి సాగునీటిని విడుదల చేయనున్నారు. మంత్రి ఉదయం 11 గంటలకు పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడ వద్ద కల్వకుర్తి లిఫ్ట్–2 ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభిస్తారని, అనంతరం జొన్నల బొగుడ రిజర్వాయర్‌ను ప్రారంభించి నీటిని విడుదల చేస్తారని కలెక్టర్ టీకే శ్రీదేవి తెలిపారు.
అనంతరం అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు లిఫ్ట్–3 పరిధిలోని గుడిపల్లి గట్టు రిజర్వాయర్‌ను ప్రారంభించి కాల్వలకు నీరు వదులుతారని, అక్కడకూడా నిర్వహించే బహిరంగ సభలో మంత్రి పాల్గొంటారని తెలిపారు. మంత్రి హరీశ్‌రావుతో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం మంత్రులు హైదరాబాద్ బయలుదేరి వెళతారు.