మైనారిటీ గురుకులాల తనిఖీ | minority residential schools visiting | Sakshi
Sakshi News home page

మైనారిటీ గురుకులాల తనిఖీ

Published Mon, Aug 22 2016 10:21 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

సదాశివపేటలోని మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాల తనిఖీ

సదాశివపేటలోని మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాల తనిఖీ

సదాశివపేట: పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను సోమవారం ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌, జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరక్టర్‌ షఫీ ఉల్లా, జిల్లా మెనార్టీ వెల్ఫేర్‌ అధికారి విక్రమ్‌రెడ్డి, మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలల ఇన్‌చార్జీ సయ్యద్‌, ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. విద్యార్ధులు నివసించే గదులు, భోజన శాల వంట గదులను పరిశీలించారు.

ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌, జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌, రాష్ట్రమైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరక్టర్‌ షఫీ కొద్దిసేపు ఉల్లాసంగా బ్యాడ్మింటన్‌ ఆట అడారు. అనంతరం సదాశివపేట మండలం సిద్దాపూర్‌ గ్రామ శివారులోని 262 సర్వే నంబర్‌లో నూతన మైనార్టీ రెసిడెన్షియల్‌ భవన నిర్మాణానికి  కేటాయించిన 5 ఎకరాల భూమిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ గిరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement