వైఎస్సార్ జిల్లా: గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నష్టాల పాలైన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కమలాపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన కమలాపురం మండలంలో పర్యటించి, బాధితులను పరామర్శించారు.
కొండాయపల్లెలో సుమారు 74 గొర్రెలను కోల్పోయిన పెంపకందారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. నష్టపోయిన వరి రైతులకు ఎకరాకు రూ.20వేలు, గొర్రెకు రూ.10వేలు చొప్పున పరిహారం అందజేయాలని అధికారులను కోరారు. అలాగే, మొలకవారిపల్లెలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను పరిశీలించి, పక్కా గృహాల మంజూరుకు ప్రతిపాదనలు పంపాలని తహశీల్దార్ రామమోహన్‌కు సూచించారు. గంగవరం గ్రామంలో వరి పైరును పరిశీలించి బాధిత రైతులతో రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడారు.
వరద బాధితులకు రవీంద్రనాథ్‌రెడ్డి పరామర్శ
Published Thu, Nov 19 2015 2:44 PM | Last Updated on Wed, Aug 1 2018 3:52 PM
Advertisement
Advertisement