స్పాట్‌ కేంద్రాన్ని పరిశీలించిన ‘కత్తి’ | mlc checkings tenth class spot | Sakshi
Sakshi News home page

స్పాట్‌ కేంద్రాన్ని పరిశీలించిన ‘కత్తి’

Published Fri, Apr 7 2017 11:53 PM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM

mlc checkings tenth class spot

అనంతపురం ఎడ్యుకేషన్‌ : పదో తరగతి స్పాట్‌ కేంద్రాన్ని శుక్రవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి సందర్శించారు. టీచర్లతో మాట్లాడారు. వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని డీఈఓను కోరారు. అన్ని డీఎస్సీల సీనియారిటీ జాబితాలను వెంటనే ప్రకటించాలన్నారు. పండిట్, పీఈటీల సీనియారిటీ జాబితానూ ప్రకటించి ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరించాలన్నారు. అన్ని ఖాళీలనూ భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

సీనియారిటీ జాబితాను తయారు చేస్తున్నామని, త్వరలోనే ప్రకటిస్తామని డీఈఓ లక్ష్మీనారాయణ చెప్పారు. స్పాట్‌ కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ వెంట ఎస్టీయూ నాయకులు రామన్న, గోవిందు, యూటీఎఫ్‌ జిలాన్, ఏపీటీఎఫ్‌ (1938) కులశేఖర్‌రెడ్డి, ఆర్‌యూపీపీ ఎర్రిస్వామి, తులసిరెడ్డి, హెచ్‌ఎం అసోసియేషన్‌ రమనారెడ్డి, పీఈటీ అసోసియేషన్‌ లింగమయ్య తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement