మారుతున్న కాలనుగుణంగా మెలకువలు పాటిస్తే బైవోల్టిన్ పట్టు పురుగుల పెంపకంలో అధిక దిగుబడులు సాధించవచ్చని మైసూరు సెరికల్చర్ శాస్త్రవేత్త మునిరత్నంరెడ్డి తెలిపారు.
లేపాక్షి (హిందూపురం): మారుతున్న కాలనుగుణంగా మెలకువలు పాటిస్తే బైవోల్టిన్ పట్టు పురుగుల పెంపకంలో అధిక దిగుబడులు సాధించవచ్చని మైసూరు సెరికల్చర్ శాస్త్రవేత్త మునిరత్నంరెడ్డి తెలిపారు. శుక్రవారం లేపాక్షి మండలం కంచిసముద్రం పంచాయతీ పరిధిలోని బసవనపల్లి గ్రామంలో కేంద్ర పట్టుమండలి, జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పట్టు రైతుల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మునిరత్నంరెడ్డి మాట్లాడుతూ, బైవోల్టిన్ పురుగుల పెంపకంలో ఆధునిక పద్ధతులు పాటించాలన్నారు.
మల్బరీలో ఆకుముడుత పురుగు సమగ్ర నియంత్రణ, పట్టు పురుగుల పెంపకంలో మెళకువలు, సెరిఫిట్ స్వచ్ఛతకు సమర్థమైన డిసిన్‌ఫిక్షన్ పద్ధతులు, ఊజి ఈగ నివారణకు సమగ్ర నియంత్రణ, పట్టుపురుగు ఆశించు చీడల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఏడీ నాగరంగయ్య బైవోల్టిన్‌లో అధిక దిగుబడులు సాధించే పద్ధతులను రైతులకు వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త మనోహర్‌రెడ్డి, సుబ్బరామయ్య, శాంత¯న్‌బాబు, శంకరప్ప, విజయకుమార్‌రెడ్డి, ఎంపీపీ హనోక్, పట్టు రైతులు పాల్గొన్నారు.