బహుళజాతి కంపెనీలకు తొత్తుగా ప్రభుత్వాలు | Multinational companies, government under | Sakshi
Sakshi News home page

బహుళజాతి కంపెనీలకు తొత్తుగా ప్రభుత్వాలు

Published Wed, Aug 10 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

బహుళజాతి కంపెనీలకు తొత్తుగా ప్రభుత్వాలు

బహుళజాతి కంపెనీలకు తొత్తుగా ప్రభుత్వాలు

  • l ఆదివాసీల అభివృద్ధిని విస్మరించిన పాలకులు 
  • l పోరాటాలే మన హక్కుల సాధనకు ఊపిరి
  • l తుడుందెబ్బSరాష్ట్ర పొలిట్‌బ్యూరో కోచైర్మన్‌ లక్ష్మీనారాయణ
  • l మండల కేంద్రంలో  భారీ బహిరంగ సభ 
  • ఏటూరునాగారం : బహుళజాతి కంపెనీలకు రెడ్‌కార్పెట్‌ పరుస్తూ ఆదివాసీల ఖనిజ వనరులు, సంపదను ప్రభుత్వాలు దోచిపెడుతు న్నాయని తుడుం దెబ్బSరాష్ట్ర పొలిట్‌ బ్యూరో కోచైర్మన్‌ సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, పొలిట్‌బ్యూరో సభ్యుడు పొడెం బాబు ఆరోపించారు.
     
    మంగళవారం కొమురం భీం మినీస్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. 70 ఏళ్లు అభివృద్ధికి ఆమడదూరంలో ఆదివాసీలు బతుకుతున్నారని అన్నారు. ఆదివాసీల అభివృద్ధి కోసం ఐటీడీఏలు ఏర్పా టు చేసినా అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉందన్నారు. ప్రపంచంలో ఆదివాసీలకు ప్రత్యేక గుర్తింపు ఉందని, కానీ ప్రభుత్వాలు ఆదివాసీల అభివృద్ధిని విస్మరించాయని అన్నారు. కోట్లాది రూపాయలు తమ కోసం ఖర్చు చేస్తున్నట్లు రికార్డుల చూపించి మైదాన ప్రాంతాల ప్రజ లకు ఖర్చు చేస్తుందన్నారు. బుధవారం వరంగల్‌లో జరిగే సదస్సుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. సీఐ రఘుచందర్‌ మాట్లాడుతూ ప్రకృతితో పెనువేస్తుకున్న జీవనం ఆదివాసీల మ న్యంలోనే ఉంటుందన్నారు.  వారి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలన్నారు. ఈ సభలో తుడుం దెబ్బ రాష్ట్ర మహిళా అధ్యక్షురా లు ఇర్ప విజయ, ఏటీడబ్ల్యూఓ దబ్బగట్ల జనార్దన్, ఆగబోయిన రవి, కోరగట్ల లక్ష్మణ్‌రావు, పొడెం శోభన్, అర్రెం లచ్చుపటేల్, చంద రఘుపతి, సపక నాగరాజు, బంగారు సాంబయ్య, దబ్బ సుధాకర్, చాప బాబుదొర, కోరం సంతోష్, బోదెబోయిన జయందర్, పొడెం నాగేశ్వర్‌రావు, సోలం పుల్లరావు, జానికిరామ్‌ పాల్గొన్నారు. కాగా, సభలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు.
    తీర్మానాలు
    l ఎస్టీలలో వర్గీకరణ కోసం కమిషన్‌ను నియమించాలి
    l ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ ఆదివాసీలకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలి
    l 1/70 చట్టం అమలు కోసం ఐటీడీఏలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ను యంత్రాంగా న్ని ఏర్పాటు చేయాలి
    l పీసా, అటవీహక్కుల చట్టాలను అమలు చేయాలి, సాదాబైనామాలను ఏజెన్సీ ప్రాంతంలో అమలు చేయరాదు
    l జీఓ నంబర్‌ 3 ప్రకారం ప్రత్యేక డీఎస్సీల ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి, ప్రమోషన్లు ఇవ్వాలి
    l ఏజెన్సీ ప్రాంతాలకున్న జీఓల ప్రకారం వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు 
    l ఏజెన్సీ ప్రాంతాల్లో హెల్త్‌ ఎమర్టేన్సి ప్రకటించాలి
    l ఏజెన్సీ ప్రాంతాల్లో తాగు, సాగు నీరు, రోడ్లు, విద్య, విద్యుత్‌ సౌకర్యాలను కల్పించాలి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement