ధర్మవరం అర్బన్: ధర్మవరం మున్సిపల్ వైస్ చైర్మన్ అంబారపు శ్రీనివాసులు తన పదవికి రాజీనామా చేశారు. ధర్మవరంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే సూర్యనారాయణకు రాజీనామా పత్రాన్ని ఆయన అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరాలపాటు మున్సిపల్ వైస్ చైర్మన్‌గా శ్రీనివాసులును ఎంపిక చేశామన్నారు. ప్రస్తుతం రెండున్నరేళ్లు పూర్తవడంతో పదవికి రాజీనామా చేశారన్నారు. మిగిలిన రెండున్నరేళ్లు గతంలో ఒప్పందం ప్రకారం మున్సిపల్ వైస్ చైర్మన్‌గా గవ్వలబాబు (లడ్డుబాబు)ను నియమిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.