హత్యకేసులో ముగ్గురి అరెస్టు
Published Fri, Feb 10 2017 11:14 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
కాకినాడ క్రైం :
ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు కాకినాడ టూటౌ¯ŒS సీఐ మహ్మద్ ఉమర్ తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేçÙన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ నెల ఒకటో తేదీ రాత్రి 9 గంటల సమయంలో టూటౌ¯ŒS పోలీస్‌స్టేçÙ¯ŒS పరి«ధిలోని సూర్యారావుపేటలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కొంత మంది వ్యక్తులు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో బోరా వెంకట ఎల్లయ్యరెడ్డి (శ్రీను)ను వడ్డాది సుధీర్ కత్తితో పొడిచి హత్యచేశాడు. ఈ విషయమై హత్యకేసుగా నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు తెలిపారు. కేసులో ఏ1 ముద్దాయి వడ్డాది సుధీర్‌కు స్వామినగర్ గ్రామానికి చెందిన గంగిరెడ్డి(గంగడు)కు మధ్య పాత తగాదాలు ఉన్నాయి. ఫిబ్రవరి ఒకటిన సుధీర్ తన స్నేహితులు గంపల లోవ వెంకట కృష్ణస్వామి, బొడ్డు అనిల్‌కుమార్, మోరే హెండ్రీ ఇసాక్ ఆంగ్లో ఇండియ¯ŒSతో కలసి మద్యం తాగడానికి బార్ అండ్ రెస్టారెంట్‌కు వచ్చాడు. పాత తగాదాల నేపథ్యంలో సుధీర్‌పై కక్షపెంచుకున్న గంగిరెడ్డి వెనుకనే వచ్చి కత్తితో పొడిచాడు. ఈ ఘటన నుంచి తేరుకున్న సుధీర్ గంగిరెడ్డి చేతిలో ఉన్న కత్తిని లాక్కొని గంగిరెడ్డిపై దాడికి యత్నించాడు. గంగిరెడ్డి స్నేహితుడు వెంకట ఎల్యయ్యరెడ్డి (శ్రీను) మధ్యలోకి వచ్చి అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో çసుధీర్, ముగ్గురు స్నేహితులు కలసి ఎల్లయ్యరెడ్డిపై కత్తి, బీర్ బాటిల్‌తో పొడిచి హత్య చేసినట్టు సీఐ ఉమర్ వివరించారు. గంగిరెడ్డి తప్పించుకుని పరారైనట్టు తెలిపారు. ఏ1 ముద్దాయి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడని, ముగ్గురు నిందితులను శుక్రవారం ఉదయం కాకినాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు తెలిపారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగానే అరెస్ట్ చేసి కోర్టుకి తరలింస్తామన్నారు.
గంగిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు
ఏ1 ముద్దాయి వడ్డాది సుధీర్‌పై హత్యాయత్నానికిపాల్పడిన స్వామినగర్‌కు చెందిన గంగిరెడ్డిపై 307 హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముద్దాయి కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు.
Advertisement
Advertisement