నాగార్జునసాగర్ (నల్లగొండ) ఆసియాఖండంలోనే ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా నాగార్జునసాగర్‌ను తీర్చిదిద్దనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌లో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రూ.34 కోట్లతో శ్రీపర్వతారామంలో బౌద్ధవనం ప్రాజెక్టు పనులు చేపట్టారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి మరో రూ. 25కోట్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు.
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావడంలో ఆలస్యమవుతోందన్నారు. యాదగిరిగుట్టకు రోప్‌వే నిర్మించే విషయాన్ని సీఎంతో చర్చించాల్సి ఉందన్నారు. మల్లెపల్లి వద్ద గల టూరిజం హోటల్‌ను రూ.30లక్షలతో ఆధునికీకరించనున్నట్లు తెలిపారు.
'ప్రముఖ బౌద్ధ కేంద్రంగా నాగార్జున సాగర్'
Published Sun, Jun 5 2016 8:03 PM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement