- మాజీ ఎంపీ హర్షకుమార్
తొండంగి(తూర్పుగోదావరి జిల్లా)
ఓటుకు కోట్లు కేసులో ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో అరెస్టుకాక తప్పదని, రాష్ట్రంలో ఆయన అణిచివేత పాలనలో బాధిత ప్రజలంతా అదే కోరుకుంటున్నారని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలోని తీరప్రాంతంలో ‘దివీస్ పరిశ్రమ’ బాధిత గ్రామం కొత్తపాకలను ఆయన సందర్శించారు. పరిశ్రమ స్థాపన, భూసేకరణ సమస్యలపై రైతులతో మాట్లాడారు. రెవెన్యూ అధికారులను భూసేకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులపై ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానంపై మండిపడ్డారు. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన యనమల.. ఇక్కడి సమస్యలపై స్పందికపోవడం దురదృష్టకరమన్నారు. దివీస్‌కు ప్రభుత్వం భూములను ఎంతకు విక్రయిస్తుందో బహిర్గతం చేయాలన్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి పూర్తి పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ నాయకుడు మేరుగు ఆనందహరి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు అంగుళూరి అరుణ్‌కుమార్, తదితరులు ఉన్నారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అరెస్ట్ తప్పదు
Published Fri, Sep 2 2016 8:07 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement