ఆలయంలో హుండీ ఆదాయం లెక్కిస్తున్న సిబ్బంది
కౌడిపల్లి: మండలంలోని తునికి నల్లపోచమ్మదేవి ఆలయ హుండీ ఆదాయం రూ.1,63,347 వచ్చినట్లు ఈఓ శ్రీనివాస్ తెలిపారు. గురువారం దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు, గ్రామస్తుల సమక్షంలో ఆదాయాన్ని లెక్కించారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు నగదు లెక్కించగా రూ 1,63,347 వచ్చినట్లు తెలిపారు. ఈఓ శ్రీనివాస్, సిబ్బంది రామకృష్ణ, గ్రామ ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్‌రెడ్డి, సర్పంచ్ సువర్ణ మోషయ్య, ఎంపీటీసీ సువర్ణ అంజయ్య, మాజీ సర్పంచ్ సాయగౌడ్, ఉపసర్పంచ్ శేఖర్, వీఆర్‌ఓ మల్లేశం, కానిస్టేబుల్ దత్తు గ్రామస్తులు పాల్గొన్నారు.
సహాయ కమిషనర్‌కు సన్మానం
తునికి నల్లపోచమ్మ ఆలయానికి మొదటిసారిగా వచ్చిన్న దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ కృష్ణప్రసాద్‌ను గ్రామ ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. అర్చకులు శివ్వప్ప ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.