నమో..నారసింహా!
నమో..నారసింహా!
Published Sat, Jan 21 2017 9:57 PM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM
- వైభవంగా జయంత్యుత్సవం
- అహోబిలంలో సుదర్శన హోమం
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంత్సుత్సవాలు శనివారం వైభవంగా నిర్వహించారు. నరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకొని..భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నవ నారసింహ క్షేత్రాల్లో తెల్లవారు జామునే మూలవిరాట్కు అర్చన, అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిగువ అహోబిలంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి శ్రీదేవి, పద్మావతి అమ్మవార్లను కొలువుంచి అభిషేకం నిర్వహించారు. తిరుమంజనం అనంతరం స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం వేద మంత్రోచ్చారణల మధ్య సుదర్శన పావన నరసింహ హోమం వైభవోపేతంగా నిర్వహించి పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించారు.
హోమం ప్రత్యేకత..
తమ కల్యాణ మహోత్సవానికి భక్తులను స్వయంగా ఆహ్వానించేందుకు ఉత్సవమూర్తులైన శ్రీ జ్వాల నరసింహస్వామి, శ్రీ ప్రహ్లాద వరద స్వాములు పారువేట మహోత్సవానికి గ్రామాలకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంలో వచ్చిన స్వాతి నక్షత్రంలో న శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, పద్మావతి అమ్మవారిని కొలువుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి సుదర్శన హోమం నిర్వహించారు. ప్రధానార్చకుడు వేణుగోపాలన్, అర్చకులు కళ్యాణం, సంతానం, మణియార్ సౌమ్యానారయన్ , ఈఓ మల్లికార్జున ప్రసాదు పర్యవేక్షణలో నిర్వహించారు.
Advertisement