తిరుపతి: మహతి ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి నందినాటకోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమైయ్యాయి. ఈ ఉత్సవాలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు. నందినాటకోత్సవాల్లో తొలిరోజున వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా హాజరయ్యారు. ఈ రోజు నుంచి తొమ్మిది రోజులపాటు ఉత్సవ ప్రదర్శనలు జరుగనున్నాయి.