
‘నందిని నర్సింగ్ హోం’ చిత్ర యూనిట్ సందడి
నందిని నర్సింగ్ హోం’ చిత్ర యూనిట్ గురువారం నగరంలో సండడి చేసింది. చిత్ర విజయోత్సవంలో భాగంగా అన్నపూర్ణ థియేటర్‌లో ప్రేక్షకులను యూనిట్ సభ్యులు కలిశారు.
గాంధీనగర్ : ‘నందిని నర్సింగ్ హోం’ చిత్ర యూనిట్ గురువారం నగరంలో సండడి చేసింది. చిత్ర విజయోత్సవంలో భాగంగా అన్నపూర్ణ థియేటర్‌లో ప్రేక్షకులను యూనిట్ సభ్యులు కలిశారు. కథానాయకుడు నవీన్ విజయకృష్ణ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినీనటుడు నరేష్ మాట్లాడుతూ నవీన్ విజయకృష్ణ నటించిన తొలిచిత్రం విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారన్నారు. సీనియర్ నటులకు పోటీగా నవీన్ విజయకృష్ణ నటించారని అభినందించారు. హిరో నవీన్ విజయకృష్ణ, హీరోయిన్ శ్రావ్య మాట్లాడుతూ తమ సినిమాకు ఘనవిజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు గిరి, కృష్ణా అభిమాన సంఘం అధ్యక్షుడు సుధాస్వామి తదితరులు పాల్గొన్నారు.