భవిష్యత్ అంతా నానో టెక్నాలజీదే
భవిష్యత్ అంతా నానో టెక్నాలజీదే
Published Sat, Jan 28 2017 11:03 PM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM
- హెచ్‌సీయూ ప్రొఫెసర్లు చంద్రశేఖర్, రామాచార్యులు
- సైన్స్ ఇన్‌స్పైర్
- ఆసక్తి రేకెత్తిస్తోందంటున్న విద్యార్థులు
కర్నూలు(ఆర్‌యూ): భవిష్యత్ అంతా నానో టెక్నాలజీదేనని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు డాక్టర్ ఆర్. చంద్రశేఖర్, డాక్టర్ రామాచార్యులు పేర్కొన్నారు. ఈ మేరకు రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతున్న సైన్స్ ఇన్‌స్పైర్ క్యాంపు రెండో రోజులో భాగంగా శనివారం వారు ముఖ్య వక్తలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ నానో పదార్థాలు, వాటి ఉపరితల దృగ్విషయాలు సైజు తగ్గే కొలది ఉపరితల వైశాల్యం పెరిగి విలక్షణమైన స్వభావాన్ని కల్గి ఉంటాయన్నారు.
ఆధునిక ప్రపంచంలో నానో మెడిసిన్, నానో బయో టెక్నాలజీ, నానో దుస్తులు, నానో జెల్స్ ఇలా మానవుని దైనందిన వస్తువుల తయారీ ఉపయోగాల గురించి విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. రాబోయే తరం నానో తరంగా భావించవచ్చని ఉద్ఘాటించారు. హెచ్‌సీయూ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ రామాచార్యులు మాట్లాడుతూ కర్బణ రసాయన శాస్త్రంలో మందుల తయారీ, వాటిని తయారు చేసే సంశ్లేషణా పద్ధతులు మానవాళికి వాటి ఉపయోగాల గురించి వివరించారు. శనివారం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నైతిక, మానవీయ విలువల పరీక్ష ఉండటంతో సైన్స్ ఇన్సై్పర్కు చాలామంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
నేటి కార్యక్రమాలు
న్యూఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ భూ రసాయన శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎన్. జనార్దన్‌రాజు పాల్గొని, భూ రసాయన శాస్త్రం, నీరు పర్యావరణం, కాలుష్యం తదితర అంశాల గురించి వివరించనున్నారు. అలాగే హెచ్‌సీయూ ప్రొఫెసర్ దయానంద బయో రెమిడేషన్ మీద ప్రసంగిస్తారు. మానవ శరీరంలో జీన్స్ ప్రోటీన్స్ తదితర వాటిపై వివరిస్తారు.
Advertisement
Advertisement