nano technology
-
‘ఇఫ్కో’ సూక్ష్మ ఎరువులకు పెరుగుతున్న డిమాండ్
సాక్షి, అమరావతి: ఎరువుల్లో నానో ఎరువులు ఓ సంచలనం. సంప్రదాయ ఎరువులకు భిన్నంగా నానో టెక్నాలజీ ద్వారా ద్రవ రూపంలో అభివృద్ధి చేసిన ఈ సూక్ష్మ ఎరువులను సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా భారత రైతులు ఎరువులు సహకార సంస్థ (ఇఫ్కో) మార్కెట్లోకి తీసుకొచ్చి0ది. ఈ నానో ఎరువులకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. విదేశాలు సైతం ఇఫ్కో సూక్ష్మ ఎరువుల కోసం క్యూకడుతున్నాయి. మరో వైపు దేశీయంగా ఇతర ఎరువుల కంపెనీలు సైతం వీటి తయారీకి ముందుకొస్తున్నాయి. నానో యూరియాకు పేటెంట్ హక్కు ప్రపంచంలోనే తొలిసారిగా నానో బయో టెక్నాలజీ ద్వారా ఇఫ్కో సూక్ష్మ ఎరువుల తయారీకి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన సూక్ష్మ ఎరువులకు ఇఫ్కో పేటెంట్ హక్కు పొందింది. నానో యూరియాను 2021–22 సీజన్లో భారతీయ మార్కెట్లోకి విడుదల చేసిన ఇఫ్కో గతేడాది నుంచి నానో డీఏపీని కూడా తీసుకొచ్చి0ది.500 మిల్లీ లీటర్ల బాటిల్లో ఉండే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాకు సమానం. బస్తా యూరియా ధర రూ.266.50 ఉంటే, నానో యూరియా బాటిల్ ధర రూ.225 మాత్రమే. డీఏపీ ఎరువుల బ్యాగ్ ధర రూ.1,350గా ఉండగా, నానో డీఏపీ 500 మిల్లీ లీటర్ల బాటిల్ ధర రూ.600కే అందుబాటులోకి తెచ్చారు. మూడేళ్లలో 3 రెట్లు పెరిగిన డిమాండ్ పర్యావరణ హితంతో పాటు సంప్రదాయ ఎరువులో ఉండే పోషకాలన్నీ నానో ఎరువుల్లో ఉంటాయి. భూసారంతో పాటు భూగర్భ జలాలపై ఎలాంటి ప్రభావం ఉండదని నిరూపితమవడంతో రైతులు కూడా వీటి పట్ల ఆసక్తిని చూపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటి వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఫలితంగా గత మూడేళ్లలో వీటి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 2021–22 సీజన్లో దేశవ్యాప్తంగా 2.12 కోట్ల బాటిల్స్ విక్రయాలు జరగ్గా, 2022–23లో 3.30 కోట్ల బాటిల్స్ విక్రయమయ్యాయి. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల వలన 2023–24 సీజన్లో 2.50 కోట్ల బాటిల్స్ విక్రయాలు జరిగాయి. 2024–25 సీజన్లో 4.60 కోట్ల నానో యూరియా, 2 కోట్ల నానో డీఏపీ బాటిల్స్ విక్రయం లక్ష్యంగా నిర్ణయించారు. ఏపీలో రికార్డు స్థాయి అమ్మకాలు నానో ఎరువుల వినియోగంలో ఉత్తర ప్రదేశ్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలు, దక్షిణ భారతదేశంలో కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో గడిచిన మూడేళ్లలో ఏపీలో ఆర్బీకేల ద్వారా రికార్డుస్థాయిలో 10.50 లక్షల బాటిల్స్ విక్రయాలు జరిగాయి. 2024–25 సీజన్ కోసం 10 లక్షల నానో యూరియా, 4 లక్షల నానో డీఏపీ బాటిల్స్‌ను ఏపీ రైతుల కోసం ఇఫ్కో సరఫరా చేస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి నాలుగింతల నత్రజని (16 శాతం)తో సహా అధిక పోషక విలువలతో కూడిన నానో యూరియా ప్లస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చి0ది. విదేశాలకు ఎగుమతులు సూక్ష్మ ఎరువుల వినియోగానికి విదేశాలు కూడా ముందుకు వస్తున్నాయి. అమెరికా, బ్రెజిల్, జాంబియా, గునియా, శ్రీలంక, ఆఫ్రికన్ దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. 2024–25 సీజన్లో 72 వేల లీటర్ల యూరియా, డీఏపీ బాటిల్స్ ఎగుమతి చేసేందుకు ఇఫ్కో సన్నాహాలు చేస్తోంది. సూక్ష్మ ఎరువుల తయారీలో దేశీయ ఎరువుల కంపెనీలు కూడా భాగస్వాములవుతుండగా, మరికొన్ని మార్కెటింగ్ చేస్తున్నాయి. మురుగప్పా గ్రూప్‌నకు చెందిన కాకినాడలోని కోరమాండల్ ఎరువుల కర్మాగారం నానో యూరియా, నానో డీఏపీ తయారు చేస్తోంది. ఒడిశాలోని పారాదీప్ ఫాస్పేట్ లిమిటెడ్ (పీపీఎల్) కూడా సూక్ష్మ ఎరువుల తయారీకి శ్రీకారం చుట్టింది. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్), రాష్రీ్టయ కెమికల్ లిమిటెడ్ (ఆర్సీఎఫ్)తో పాటు ఫ్యాక్ట్ వంటి ఎరువుల కంపెనీలు ఇఫ్కో సూక్ష్మ ఎరువులను మార్కెటింగ్ చేస్తున్నాయి. సూక్ష్మ ఎరువులకు డిమాండ్ పెరుగుతోంది ఇఫ్కో సూక్ష్మ ఎరువులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచ దేశాలు సైతం వీటి వినియోగానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇఫ్కో బాటలోనే ఇతర ఎరువుల కంపెనీలు సైతం సూక్ష్మ ఎరువుల తయారీకి ముందుకొస్తున్నాయి. తొలి ఏడాది 2 కోట్ల బాటిల్స్ అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది 6.60 కోట్ల బాటిల్స్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. నానో యూరియా, నానో డీఏపీతో పాటు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి నానో యూరియా ప్లస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చాం. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి నానో జింక్, నానో కాపర్‌ను తీసుకొచ్చేందుకు ఇఫ్కో సన్నాహాలు చేస్తోంది. – టి.శ్రీధర్‌రెడ్డి, ఏపీ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో -
వచ్చేస్తోంది ‘నానో డీఏపీ’.. అర లీటర్ డీఏపీ బాటిల్ కేవలం రూ.600లే
సాక్షి, అమరావతి: నానో యూరియా మాదిరిగానే నానో డీఏపీ (డైఅమ్మోనియం ఫాస్పేట్) కూడా వచ్చేస్తోంది. తొలకరి సీజన్ నుంచే నానో డీఏపీని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కో–ఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో) సర్వం సిద్ధం చేసింది. 2021లో మార్కెట్లోకి వచ్చిన నానో యూరియా రైతుల మన్ననలు పొందుతోంది. తాజాగా ఈ ఖరీఫ్ నుంచే నానో డీఏపీని మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. అర లీటర్.. 50 కేజీల బస్తాతో సమానం గుళికల రూపంలో ఉండే సంప్రదాయ ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఇఫ్కో సంస్థ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్‌తో కలిసి నానో టెక్నాలజీ ద్వారా ద్రవరూపంలో సూక్ష్మ ఎరువులను మార్కెట్లోకి తీసుకొస్తున్న విషయం విదితమే. నానో యూరియా మాదిరిగానే.. నానో డీఏపీ కూడా 500 మిల్లీ లీటర్ల బాటిల్ 50 కేజీల డీఏపీ ఎరువుల బస్తాతో సమానమని ఇఫ్కో స్పష్టం చేస్తోంది. డీఏపీ ఎరువుల బస్తా ధర మార్కెట్లో రూ.1,350 ధర పలుకుతోంది. నానో యూరియా అర లీటర్ బాటిల్ ధర కేవలం రూ.600 మాత్రమే. అంటే సంప్రదాయ డీఏపీ ఎరువుల బస్తాతో పోలిస్తే రూ.750 తక్కువ ధరకే మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతుంది. ఎన్నో ప్రత్యేకతలు డీఏపీ ఎరువుల వినియోగం పంటల సాగులో చాలా కీలకం. మార్కెట్లోకి రానున్న నానో డీఏపీ పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించకుండా.. పంటలకు అవసరమైన పోషక అవసరాలను తీరుస్తుంది. నానో డీఏపీలో నత్రజని 8 శాతం, భాస్వరం 16 శాతం ఉంటుంది. నానో డీఏపీ కణ పరిమాణం 100 నానోమీటర్ కంటే తక్కువగా ఉండటం వల్ల విత్తనం లోపలికి, శ్వాస క్రియ ద్వారా మొక్కలలోకి సులభంగా ప్రవేశిస్తుంది. పంటలకు అవసరమైన నత్రజని (నైట్రోజన్), భాస్వరం (ఫాస్పరస్ పెంటాక్సైడ్)ను సమపాళ్లలో అందిస్తుంది. మొక్కల్లో వీటి లోపాలను సరిచేస్తుంది. సమపాళ్లలో వ్యాప్తి చెందడం వల్ల విత్తన శక్తితోపాటు కిరణజన్య సంయోగ క్రియ సామర్థ్యం పెరుగుతుంది. మెరుగైన, నాణ్యమైన పంటల దిగుబడికి దోహదపడుతుంది. క్షేత్రస్థాయి పరిశీలనలో పోషక వినియోగ సామర్థ్యం 90 శాతానికి పైగానే ఉన్నట్టు నిర్ధారించారు. రానున్న ఖరీఫ్‌లో 4.50 లక్షల లీటర్లు (9లక్షల బాటిల్స్), రబీలో 5.50 లక్షల లీటర్లు (11లక్షల బాటిల్స్) అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో నానో జింక్, నానో కాపర్ కూడా.. ఎరువుల మార్కెట్ రంగంలో భారత శాస్త్రవేత్తలు నానో యూరియాను సృష్టించి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఇందుకుగాను ఇఫ్కో పేటెంట్ కూడా పొందింది. ఇప్పుడు శాస్త్రవేత్తల కృషితో అదే బాటలో నానో డీఏపీని మార్కెట్లోకి తీసుకొస్తోంది. త్వరలో నానో జింక్, నానో కాపర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఇఫ్కో సన్నాహాలు చేస్తోంది. వినియోగం పెరుగుతోంది ఖరీఫ్–1021లో మార్కెట్లోకి తీసుకొచ్చిన నానో యూరియా వినియోగంపై రైతుల్లో ఆసక్తి పెరిగింది. ఖరీఫ్–21లో రాష్ట్రంలో 17 వేల లీటర్ల నానో యూరియా అమ్ముడు కాగా.. తరువాత ఏడాది 2.73 లక్షల లీటర్లు అమ్ముడైంది. 2022–23 ఖరీఫ్‌లో 1.25 లక్షల లీటర్లు, రబీలో 2.40 లక్షల లీటర్ల మేర విక్రయాలు జరిగాయి. సూక్ష్మ ఎరువులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం చేస్తుండటంతో రైతుల్లో చైతన్యం పెరిగి 2023–24 వ్యవసాయ సీజన్ నుంచి నానో యూరియా నిల్వలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచేందుకు ఇఫ్కో ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు వచ్చే ఖరీఫ్ సీజన్లో 12.50 లక్షల లీటర్లు, రబీలో 17.50 లక్షల లీటర్లు నానో యూరియా నిల్వలు రాష్ట్రానికి కేటాయించింది. నానో యూరియాతో పాటు కొత్తగా వస్తున్న నానో డీఏపీని ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వీటి వినియోగంపై ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేసేందుకు కార్యాచరణ సిద్ధమైంది. ఎకరాకు బాటిల్ యూరియా వేశా వరిలో ఎకరాకు 3–4 బస్తాల యూరియా వాడేవాళ్లం. ప్రస్తుతం ఎకరాకు ఒక బాటిల్ మాత్రమే వాడాను. చామంతి, టమోటా, మిరప తోటల్లో కేఊడా వాడుతున్నాను. మంచి ఫలితం కనిపిస్తోంది. మిరప కాయలో మంచి ఊట, ఎదుగుదల కన్పిస్తోంది. – పి.నాగబాబు, నాగాయతిప్ప, కృష్ణా జిల్లా నానో డీఏపీ రెడీ చేస్తున్నాం నానో డీఏపీ రెడీ చేస్తున్నాం. మార్క్‌ఫెడ్ ద్వారా నానో డీఏపీని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. దీని వినియోగం వల్ల రైతులకు ఎరువుల ఖర్చులు బాగా తగ్గుతాయి. నానో యూరియా వినియోగంపై రైతుల్లో చైతన్యం పెరుగుతోంది. వచ్చే ఖరీఫ్ నుంచి పూర్తిస్థాయిలో నానో యూరియాను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. డిమాండ్‌ను బట్టి నిల్వలు పెంచేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. – టి.శ్రీధర్‌రెడ్డి, స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో -
నిలకడగా ఉన్న నీటితోనూ విద్యుత్తు!
గువాహటి: ఇళ్లల్లో, వీధుల్లో, పల్లెల్లో, పట్టణాల్లోనూ కనిపించే అతి సాధారణ దృశ్యమేది? జల వనరులు! కుండల్లో, కుంటల్లో, చెరువుల్లో ఇలా అన్నిచోట్ల నిలకడగా ఉండే నీరు కనిపిస్తూనే ఉంటుంది. ప్రవహించే నీటితో విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు ఇప్పటికే కొన్ని టెక్నాలజీలు ఉండగా.. నిలకడగా ఉన్న నీటితోనూ కరెంటు పుట్టించే అవకాశమేర్పడింది. ఇందుకు అవసరమైన వినూత్నమైన పదార్థాలను ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు తయారు చేయడం దీనికి కారణం. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. పదార్థాలను ఉపయోగించుకుని ఎక్కడికక్కడ చిన్న స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి చేసుకోగలగడం. ఏసీఎస్ అప్లైడ్ నానో మెటీరియల్స్ జర్నల్ తాజా సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. పదార్థాల ధర్మాలు స్థూల ప్రపంచంలో ఒకలా.. సూక్ష్మ ప్రపంచంలో మరోలా ఉంటాయని నానో టెక్నాలజీ గతంలో తేల్చింది. నానోస్థాయిలో వ్యక్తమయ్యే ఇలాంటి ధర్మమే ‘ఎలక్ట్రో కైనెటిక్ స్ట్రీమింగ్ పొటెన్షియల్’. ఈ ధర్మాన్ని వాడి ఇంటి నల్లాల్లో ప్రవహిస్తున్న నీటితో విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చునని అంటున్నారు. ‘కాంట్రాస్టింగ్ ఇంటర్‌ఫేషియల్ ఆక్టివిటీస్’అనే మరో నానోస్థాయి ధర్మం ఆధారంగా సిలికాన్ వంటి అర్ధవాహకాలను ఉపయోగించుకుని నిలకడగా ఉన్న నీటితో విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చునని చెబుతున్నారు. ముప్పు ముంచుకొస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభిృవృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు ఎంచుకున్న పద్ధతి వినూత్నమైనదీ.. ఇప్పటివరకూ ఎవరూ ప్రయత్నించనిది. ‘విద్యుత్తు చార్జ్ ఉన్న సూక్ష్మస్థాయి కాలువల్లాంటి నిర్మాణాల ద్వారా ద్రవాలు ప్రవహిస్తున్నప్పుడు వోల్టేజీ ఉత్పత్తి అవుతుంది. అతిసూక్ష్మమైన జనరేటర్లను తయారుచేసి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు’అని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త కళ్యాణ్ రైడోంగియా తెలిపారు. ఈ విషయం చాలాకాలంగా తెలిసినప్పటికీ ఉత్పత్తి అయ్యే విద్యుత్తు చాలా తక్కువ కావడంతో ఎవరూ ప్రయత్నించలేదని చెప్పారు. నానోస్థాయిలో పరిశోధనలు చేయడం ద్వారా తాము మునుపటి సమస్యలను అధిగమించగలిగామని, విద్యుదుత్పత్తిని వేలరెట్లు ఎక్కువ చేయవచ్చునని తాము గుర్తించామని కళ్యాణ్ వివరించారు. నిలకడగా ఉన్న నీటి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు తాము గ్రాఫీన్ పెచ్చులతో పరికరాలను తయారు చేశామని, దీన్ని నీటిలో ముంచడం ఆలస్యం... విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. గ్రాఫీన్‌లో మార్పులు చేసి తాము ఫిల్టర్ పేపర్లపై ఏర్పాటు చేశామని, వీటికి నీరు తాకినప్పుడు సుమారు 570 మిల్లీ వోల్టుల విద్యుత్తు ఉత్పత్తి అయిందని వివరించారు. -
నానో టెక్నాలజీతో అదృశ్య శక్తి
అకస్మాత్తుగా ఉన్నచోటి నుంచి మాయమైపోవడం ఇప్పటికైతే సినిమాలకే పరిమితం కానీ.. సమీప భవిష్యత్తులో ఈ అద్భుతం నిజ జీవితంలోనూ సాధ్యం కానుంది. నానోటెక్నాలజీ రంగంలో మిషిగాన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సాధించిన ప్రగతి ఇందుకు కారణం. కంప్యూటర్ల మైక్రో ప్రాసెసర్ల తయారీకి సిలికాన్ లాంటి సెమీ కండక్టర్లను వాడుతుంటాం కదా.. అలాంటి పదార్థాల్లోకి వీరు నానోస్థాయి లోహపు కణాలను చొప్పించగలిగారు. అతితక్కువ సిలికాన్‌ను వాడి మైక్రో ప్రాసెసర్లను తయారు చేయడం వీలవుతుంది. ఈ నానోస్థాయి లోహపు కణాలు సెమీ కండక్టర్లలో ఎక్కడెక్కడ, ఎలా చేరాలో నియంత్రించే అవకాశం కూడా ఉండటం వల్ల ‘రివర్స్ రిఫ్రాక్షన్’అనే భౌతిక ధర్మం ఆధారంగా వస్తువులను పాక్షికంగా కనిపించకుండా చేయొచ్చని ఈ ప్రయోగాల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త రాచల్ గోల్డ్‌మ్యాన్ అంటున్నారు. సెమీ కండక్టర్లలోకి లోహపు నానో కణాలు చొప్పిస్తే.. అవి అతిసూక్ష్మమైన అద్దాలుగా పనిచేస్తాయని, తన గుండా ప్రవహించే విద్యుత్తులో ఎక్కువభాగాన్ని కాంతిగా మార్చగలవని తెలిపారు. ఈ రకమైన సెమీ కండక్టర్లను ఎల్ఈడీల్లో ఉపయోగిస్తే వాటి సామర్థ్యం 50 శాతం వరకు పెరుగుతుందని చెప్పారు. -
ఉప్పునీరు మంచినీరుగా
సముద్రనీటిని మంచినీటిగా మార్చేందుకు రైస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన, చౌకైన మార్గాన్ని ఆవిష్కరించారు. కరెంటు అవసరం లేకపోవడం, సూర్యరశ్మిని మాత్రమే వాడుకుని నిర్లవణీకరణ (ఉప్పునీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియ)ను పూర్తి చేయడం ఈ పద్ధతి తాలూకూ విశేషం. సముద్ర నీటిని మంచినీటిగా మార్చే ప్రస్తుత పద్ధతులు ఎంతో వ్యయప్రయాసలతో కూడు కున్నవి కావడంతో చౌకైన నిర్లవణీకరణ పద్ధతి కోసం రైస్ వర్సిటీ శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నానో టెక్నాలజీ సాయంతో ఒకవైపు నీటిని వేడి చేస్తూనే ఇంకోవైపు వాటిలోని లవణాలను ఫిల్టర్ చేసేందుకు ప్రత్యేకమైన పద్ధతిని అభివృద్ధి చేశారు. ఉప్పు నీటిని వేడి చేసేందుకు సోలార్ ప్యానెల్స్‌ను మాత్రమే వాడటం.. పీడనానికి గురిచేయాల్సిన అవసరం కూడా లేకపోవడంతో ఈ సరికొత్త పద్ధతి ద్వారా అతిచౌకగా మంచినీటిని పొందవచ్చునని శాస్త్రవేత్త నియోమీ హాలస్ తెలిపారు. ఫొటోలో చూపినట్లు ఉండే వ్యవస్థ ద్వారా గంటకు ఆరు లీటర్ల మంచినీరు ఉత్పత్తి చేయవచ్చునని చెప్పారు. -
భవిష్యత్ అంతా నానో టెక్నాలజీదే
- హెచ్‌సీయూ ప్రొఫెసర్లు చంద్రశేఖర్, రామాచార్యులు - సైన్స్ ఇన్స్పైర్ - ఆసక్తి రేకెత్తిస్తోందంటున్న విద్యార్థులు కర్నూలు(ఆర్యూ): భవిష్యత్ అంతా నానో టెక్నాలజీదేనని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు డాక్టర్ ఆర్. చంద్రశేఖర్, డాక్టర్ రామాచార్యులు పేర్కొన్నారు. ఈ మేరకు రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతున్న సైన్స్ ఇన్స్పైర్ క్యాంపు రెండో రోజులో భాగంగా శనివారం వారు ముఖ్య వక్తలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ నానో పదార్థాలు, వాటి ఉపరితల దృగ్విషయాలు సైజు తగ్గే కొలది ఉపరితల వైశాల్యం పెరిగి విలక్షణమైన స్వభావాన్ని కల్గి ఉంటాయన్నారు. ఆధునిక ప్రపంచంలో నానో మెడిసిన్, నానో బయో టెక్నాలజీ, నానో దుస్తులు, నానో జెల్స్ ఇలా మానవుని దైనందిన వస్తువుల తయారీ ఉపయోగాల గురించి విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. రాబోయే తరం నానో తరంగా భావించవచ్చని ఉద్ఘాటించారు. హెచ్‌సీయూ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ రామాచార్యులు మాట్లాడుతూ కర్బణ రసాయన శాస్త్రంలో మందుల తయారీ, వాటిని తయారు చేసే సంశ్లేషణా పద్ధతులు మానవాళికి వాటి ఉపయోగాల గురించి వివరించారు. శనివారం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నైతిక, మానవీయ విలువల పరీక్ష ఉండటంతో సైన్స్ ఇన్సై్పర్కు చాలామంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. నేటి కార్యక్రమాలు న్యూఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ భూ రసాయన శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎన్. జనార్దన్‌రాజు పాల్గొని, భూ రసాయన శాస్త్రం, నీరు పర్యావరణం, కాలుష్యం తదితర అంశాల గురించి వివరించనున్నారు. అలాగే హెచ్‌సీయూ ప్రొఫెసర్ దయానంద బయో రెమిడేషన్ మీద ప్రసంగిస్తారు. మానవ శరీరంలో జీన్స్ ప్రోటీన్స్ తదితర వాటిపై వివరిస్తారు. -
నానో టెక్నాలజీతో ఎన్నో ప్రయోజనాలు
మదనపల్లెక్రైం: ప్రపంచంలో నానో టెక్నాలజీ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, దీనిపై లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. సూక్ష్మ పదార్థాల ద్వారా వస్తు తయారీ విధానాన్ని అధ్యయనం చేసేందుకు స్థానిక బీటీ కళాశాలలో బుధవారం రూల్ ఆఫ్ నానో టెక్నాలజీ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఫిజికల్ అండ్ బయోసెన్సైస్‌పై జాతీయ సద స్సును ప్రారంభించారు. ముందుగా బీటీ కళాశాల వ్యవస్థాపకురాలు అనిబి సెంట్ విగ్రహానికి పూలమాల వేసి, ఘన నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో రెండు రోజుల సెమినార్‌ను ప్రారంభించారు. మొదటి రోజు పలు ప్రాముఖ్యమైన విషయాలపై ప్రొఫెసర్లు అధ్యయనం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మిట్స్ కాలేజ్ కరస్పాండెంట్ నాదేళ్ల విజయభాస్కర్‌చౌదరి మాట్లాడుతూ నానో టెక్నాలజీ విస్తరిస్తున్న సమయంలో జాతీయ స్థాయి సెమినార్ బీటీ కళాశాలలో నిర్వహించ డం గర్వంగా ఉందన్నారు. చైర్పర్సన్ ప్రొఫెసర్ లక్ష్మణరావు మాట్లాడుతూ నానోసైన్స్, నానో టెక్నాలజీని ఉపయోగించి పదార్థాలను సూక్ష్మస్థాయిలో సృష్టించి వాటి భౌతిక, రసాయనిక, జీవశాస్త్ర, విద్యుత్, దృశ్య, ఎలక్ట్రానిక్, యాంత్రిక ధర్మాలను అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. వ్యవసాయ, వైద్య, వాతావరణ పరిశోధక, సమాచార రంగాలను నానో టెక్నాలజీ ద్వారా అనువర్తించనున్నట్లు పేర్కొన్నారు. నానో టెక్నాలజీ ద్వారా పదార్థాన్ని, శక్తిని, స్థలాన్ని పొదుపు చేయవచ్చన్నారు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని తెలిపారు. ఈ సదస్సులో పాఠశాల ప్రిన్సిపాల్ కిజర్ మహ్మద్, వైస్ ప్రిన్సిపాల్ స్వర్ణరాణి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుగుణమ్మ, ఆదిత్య కాలేజ్ రామలింగారెడ్డి, ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఓఎండీ హుస్సేన్, హెచ్‌వోడీ శివరామయ్య, శ్రీకుమార్, రాయలసీమ జిల్లాల్లోని ప్రొఫెసర్లు, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పాలమూరు వాసికి ఇన్ఫోసిస్ అవార్డు
ఐరాస మాజీ కార్యదర్శి కోఫీ అన్నన్ చేతుల మీదుగా ప్రదానం కొల్లాపూర్ (మహబూబ్‌నగర్), న్యూస్‌లైన్: నానో టెక్నాలజీ రంగంలో విశేష కృషి చేస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన వలిపె రాంగోపాల్‌రావు ప్రతిష్టాత్మక ఇన్ఫోసిస్ అవార్డును అందుకున్నారు. శనివారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ చేతుల మీదుగా రాంగోపాల్‌రావు ఈ అవార్డును అందుకున్నారు. తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఫలితాలనిచ్చే నానో టెక్నాలజీ పరికరాల ఆవిష్కరణలో ప్రతిభ చాటిన రాంగోపాల్రావుకు 2013లో ఈ అవార్డును ప్రకటించారు. అవార్డు కింద రూ. 55 ల క్షల నగదును కూడా అందజేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా 2005లో శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డును కూడా రాంగోపాల్‌రావు అందుకున్నారు. రూ. 100 ఖర్చుతోనే సొంతంగా గుండెజబ్బులను తెలుసుకునే ప్రత్యేక సెన్సర్‌ను ఆయన రూపొందించారు. పోలీసు జాగిలాల సహాయం లేకుండానే పేలుడుపదార్థాలను గుర్తించే ఈ-డాగ్ అనే సెన్సర్నూ ఆవిష్కరించారు. వ్యవసాయ పరంగా రైతులకు ఉపయుక్తంగా ఉండే పలు పరిశోధనలు కూడా కొనసాగిస్తున్నారు.