నానో టెక్నాలజీతో అదృశ్య శక్తి | Invisibility force with nano technology | Sakshi
Sakshi News home page

నానో టెక్నాలజీతో అదృశ్య శక్తి

Published Sat, Jul 22 2017 3:17 AM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM

నానో టెక్నాలజీతో అదృశ్య శక్తి

నానో టెక్నాలజీతో అదృశ్య శక్తి

అకస్మాత్తుగా ఉన్నచోటి నుంచి మాయమైపోవడం ఇప్పటికైతే సినిమాలకే పరిమితం కానీ.. సమీప భవిష్యత్తులో ఈ అద్భుతం నిజ జీవితంలోనూ సాధ్యం కానుంది. నానోటెక్నాలజీ రంగంలో మిషిగాన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సాధించిన ప్రగతి ఇందుకు కారణం. కంప్యూటర్ల మైక్రో ప్రాసెసర్ల తయారీకి సిలికాన్‌ లాంటి సెమీ కండక్టర్లను వాడుతుంటాం కదా.. అలాంటి పదార్థాల్లోకి వీరు నానోస్థాయి లోహపు కణాలను చొప్పించగలిగారు. అతితక్కువ సిలికాన్‌ను వాడి మైక్రో ప్రాసెసర్లను తయారు చేయడం వీలవుతుంది.

ఈ నానోస్థాయి లోహపు కణాలు సెమీ కండక్టర్లలో ఎక్కడెక్కడ, ఎలా చేరాలో నియంత్రించే అవకాశం కూడా ఉండటం వల్ల ‘రివర్స్‌ రిఫ్రాక్షన్‌’అనే భౌతిక ధర్మం ఆధారంగా వస్తువులను పాక్షికంగా కనిపించకుండా చేయొచ్చని ఈ ప్రయోగాల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త రాచల్‌ గోల్డ్‌మ్యాన్‌ అంటున్నారు. సెమీ కండక్టర్లలోకి లోహపు నానో కణాలు చొప్పిస్తే.. అవి అతిసూక్ష్మమైన అద్దాలుగా పనిచేస్తాయని, తన గుండా ప్రవహించే విద్యుత్తులో ఎక్కువభాగాన్ని కాంతిగా మార్చగలవని తెలిపారు. ఈ రకమైన సెమీ కండక్టర్లను ఎల్‌ఈడీల్లో ఉపయోగిస్తే వాటి సామర్థ్యం 50 శాతం వరకు పెరుగుతుందని చెప్పారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement