నానో టెక్నాలజీపై జాతీయ సదస్సు
నానో టెక్నాలజీపై జాతీయ సదస్సు
Published Thu, Aug 18 2016 12:59 AM | Last Updated on Tue, Oct 2 2018 4:09 PM
బాలాజీచెరువు : అప్లికేషన్స్ ఆఫ్ నానో టెక్నాలజీ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్’ అనే అంశంపై అన్నవరం సత్యవతీదేవి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో (అటానమస్) బుధవారం జాతీయ సదస్సు ప్రారంభమైంది. సదస్సుకు అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ డాక్టర్ రత్నగిరి ఉష మాట్లాడుతూ ప్రపంచంలో పరిశోధనా రంగంలో వేగవంతమైన సత్ఫలితాలనిస్తున్న నానో టెక్నాలజీపై జాతీయ సదస్సు నిర్వహించడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా నన్నయ వర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మట్టారెడ్డి మాట్లాడుతూ వైద్యరంగంలో ‘నానో పార్టికల్స్’ వినియోగాన్ని వివరించారు. విశిష్ట అతిథి ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మన పూర్వీకులైన భారతీయులు బంగారం, వెండి, ఇత్తడి, సిరామిక్ లోహాలను వినియోగించిన తీరులో, వైద్యానికి సంబంధించి తయారు చేసే ఔషధాలలో ‘నానో పార్టికల్స్‌ను’ వినియోగించేవారన్నారు. అనంతరం కన్వీనర్లు అనంతలక్ష్మి, శ్రీదేవి ఈ థీమ్‌ని ఎంపిక చేయడానికి గల లక్ష్యాలను వివరించారు. సుమారు 50 మంది పరిశోధనా పత్రాలను సమర్పించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రత్నగిరి ఉషతో పాటు ప్రముఖులు సెమినార్ సావనీర్ ఆవిష్కరించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.
Advertisement