విశ్వబ్రాహ్మణులు మరో పోరాటానికి సిద్ధం కావాలి | Needs to prepare for another struggle visvabrahmanulu | Sakshi
Sakshi News home page

విశ్వబ్రాహ్మణులు మరో పోరాటానికి సిద్ధం కావాలి

Published Mon, Aug 1 2016 1:50 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

Needs to prepare for another struggle visvabrahmanulu

నయీంనగర్‌ : విశ్వ బ్రాహ్మణులు ఆర్థిక సంక్షోభంతో కుటుంబాలను పోషించుకోలేని దుస్థితిలో ఉంటుండడంతో అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని విశ్వబ్రాహ్మణ యూత్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు ఐలాపురం వేణుచారి ఆందోళన వ్యక్తం చేశారు. హన్మకొండ నయీంనగర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశానికి మల్లోజు సత్యనారాయణచారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వేణుచారి మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులు అన్ని రంగాల్లో స్థిరపడుతూ ఆత్మసై్థర్యంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వం విశ్వబ్రాహ్మణుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కరించడానికి కృషి చేయాలని కోరారు. సంఘం రాష్ట్ర నాయకుడు ముగులోజు రాజగోపాలచారి మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులంతా ఏకమై కార్పొరేషన్‌ను సాధించుకోవడానికి ఉద్యమించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు చిట్టిమల్ల నాగరాజు, నారాయణగిరి రాజు, ఆకోజు బ్రహ్మచారి, అనుపురం వినోద్, బాలోజు శ్రీకాంతాచారి, బండ్ల భాస్కరాచారి, రావుల నాగరాజు, కందుకూరి శ్రీకాంత్, దీపక్, సుధీర్, సతీష్, హయగ్రీవాచారి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement