పోలీసుల అదుపులో నలుగురు | New currency notes seized | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో నలుగురు

Published Sun, Nov 27 2016 11:56 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

New currency notes seized

  •  రూ. 2.56 లక్షల కొత్త రూ.2 వేల నోట్లు స్వాధీనం
  • నెల్లూరు (క్రైమ్‌): కమీషన్‌ పద్ధతిపై నగదు మార్పిడి చేస్తున్నారన్న సమాచారం మేరకు ఒకటో నగర పోలీసులు ఆదివారం రాత్రి మన్సూర్‌నగర్‌లోని ఓ ఇంటిపై దాడి చేశారు. మన్సూర్‌నగర్‌కు చెందిన మస్తానయ్య పాతనోట్లు రూ.లక్షకు రూ.20 వేల తీసుకుని కొత్త నోట్లు ఇస్తున్నాడని ఒకటో నగర పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఒకటో నగర ఎస్‌ఐ జిలానీబాషా ఆదివారం రాత్రి మస్తానయ్య ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో రఘు, సురేష్, హమీద్‌ అనే వాళ్లు అక్కడ ఉండటం, వారి వద్ద రూ.2 వేల కొత్త నోట్లు రూ.2.56 లక్షలు ఉండగా స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ నగదు తమ సొంత డబ్బులని చెప్పడంతో వారిని విచారిస్తున్నట్లు ఎస్‌ఐ జిలానీబాషా తెలిపారు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement