రాజకీయ స్వప్రయోజనాల కోసమే కొత్త జిల్లాలు
రాజకీయ స్వప్రయోజనాల కోసమే కొత్త జిల్లాలు
Published Sat, Oct 8 2016 10:39 PM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM
గుర్రంపోడు : రాజకీయ స్వప్రయోజనాల కోసమే అశాస్త్రీయ పద్ధతుల్లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి విమర్శించారు. శనివారం గుర్రంపోడులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాల విభజనలో దూరం, వైశ్యాలం, జనాభా, సంస్కృతి, రాజరిక కట్టడాలు, కొత్త జిల్లాల్లో ప్రజలకు ఉపాధి అవకాశాల పెరుగుదల వంటి అంశాలను ఏవీ పరిగణలోకి తీసుకోకపోవడం శోచనీయమన్నారు. సిరిసిల్లను జిల్లా చేయడానికి జనగామ, గద్వాల, అసిఫిబాద్ జిల్లాలను ఏర్పాటు చేశారని అన్నారు. రైతులకు భరోసా కల్పించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలపై ఉద్యమించేందుకు సీపీఐ గ్రామ, మండల, జిల్లా మహాసభలు నిర్వహిస్తుందని, వచ్చే నెల 17,18 నెలల్లో జిల్లా మహాసభ, 28,29,30 తేదీల్లో వరంగల్‌లో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు కలకొండ కాంతయ్య, మండల సీపీఐ కార్యదర్శి రేపాక లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.
Advertisement