
వ్యవసాయ కార్యాలయాల్లో ‘నూతన’ సందడి
అనంతపురం అగ్రికల్చర్ : స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో జేడీఏ పీవీ శ్రీరామమూర్తి, ఏపీఎంఐపీలో పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఉద్యానశాఖ లో డీడీ బీఎస్ సుబ్బరాయుడు, పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో జేడీ డాక్టర్ రవీంద్రనాథఠాగూర్ కేక్ కట్ చేసి కొత్త సంబరాలను ఘనంగా చేసుకున్నారు. ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, విత్తనాలు, ఎరువుల దుఖాణాదారులు, డీలర్లు, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో కార్యాలయాలకు వచ్చి అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.