‘అధికార’ నేతలు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. బుగ్గ కారు ఎక్కాలని తహతహలాడుతున్నారు. అందుకోసం రాజధాని స్థాయిలో యత్నాలను ముమ్మరం చేశారు. అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయారు. మరి కేసీఆర్ మదిలో ఏముందో? ఇటు జిల్లా స్థాయి పదవుల కోసమూ పోటీ పెరుగుతోంది. ఇప్పటికే పలువురు నాయకులు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కొత్త సంవత్సరంలో తమ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోందన్న అంచనాలలో అధికార పార్టీ నేతలు అప్పుడే నిమగ్నమయ్యారు. ప్రభుత్వం త్వరలోనే భర్తీ చేయ నున్న రాష్ర్టస్థాయి కార్పొరేషన్ పదవులపై కలలు కంటున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన చాలా రోజులకు మంత్రివర్గాన్ని విస్తరించారు. ఈ సందర్భంగా త్వరలోనే పలువురు ఎమ్మెల్యేలకు పార్లమెం టరీ కార్యదర్శులు, కార్పొరేషన్ చైర్మన్ల పదవులు కట్టబెట్టనున్నట్లు ప్రకటిం చారు.
పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం ప్రక్రియ పూర్తయ్యింది. ఇక మిగిలింది కార్పొరేషన్‌పదవులే. జిల్లాకు చెందిన పలువురు శాసనసభ్యులు వాటి కోసం పోటీపడుతున్నారు. కొందరు తమకు ‘ఫలానా’ కార్పొరేషన్ ఖరారైందని కూడా ప్రచారం చేసుకుంటుండంతో సీనియర్ ఎమ్మెల్యేలు, నాయకులు ప్ర యత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇదే క్రమంలో గురువా రం సీఎం కేసీఆర్‌ను జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కలవడం చర్చనీయాంశంగా మారింది.
ఆ రెండు పదవులు వలస నేతలకే
వాస్తవానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జిల్లా నుంచి ఇద్దరికీ మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని ఆశించారు. అప్పుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఒక్కరికే వ్యవసాయ శాఖ మంత్రిగా స్థానం దక్కింది. జిల్లాలో రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను, మొత్తం స్థానాలను గెలిచినా ఒ క్కరికే చోటివ్వడం సీనియర్ శాసనసభ్యులను కొంత అసంతృప్తికి గురి చేసింది.
మలివిడతలోనైనా కేసీఆర్ కేబినేట్‌లో కొలువు తీరుతామనుఉంటే, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు ‘విప్’ ఇచ్చి సరిపుచ్చారు. బయటకు ఎవ్వరు మాట్లాడకున్నా, ఇదీ కూడా జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలను అసంతృప్తికి గురి చేసింది. మంత్రి, విప్ ఇద్దరు కూడా 2009 ఎన్నికలలో టీడీపీ నుంచి గెలుపొంది టీఆర్‌ఎస్‌లో చేరినవారే కావడమూ పార్టీ క్యాడర్‌లో చర్చకు కారణమవుతోంది. ఆ ఇద్దరు నేతలు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంపై విసిగి, టీఆర్‌ఎస్‌లో చేరి తెలంగాణ ఉద్యమంలో మమేకమై, ఉప, సాధారణ ఎన్నికలలో గెలుపొందారు.
అయినా, పార్టీ ఆవి ర్భావం నుంచి ఉంటూ, మూడు, నాలుగు సార్లు గెలి చినవారికి మంత్రివర్గంలో చోటు దక్కలేదన్న ఆ వేదన కూడ ఉంది. తొలి, మలి ఉద్యమంలో కీల కంగా ఉండి శాసనసభ్యులుగా మొదటి సారి గెలిచిన వారు సైతం రాష్ట్రస్థాయి పదవులు, బుగ్గకారు కోరుకుంటున్నారు. మరి, కార్పొరేషన్ పదవులకు అధినేత ఏ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటారు?ఎవరి కి అవకాశం దక్కుతుంది? అన్న చర్చ జరుగుతోంది.
ఇందూరుకు దక్కే పదవులేమిటో!
మంత్రి పదవి ఆశించి భంగపడిన ఏనుగు రవీందర్‌రెడ్డికి నామినేటెడ్ పదవి ఖచ్చితమన్న ప్రచారం ఉంది. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూరు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేష్ గుప్తా బుగ్గ కారును ఆశిస్తున్నారు. ‘విప్’ వచ్చినట్లే వచ్చి చేజారిన నేపథ్యంలో బోధన్ ఎమ్మెల్యే అ హ్మద్ షకీల్ కూడ ప్రయత్నాలలో ఉన్నారు.
రవీందర్‌రెడ్డికి మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌ఎండీసీ) చైర్మన్ పదవి వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. వే ముల ప్రశాంత్‌రెడ్డి వాటర్‌గ్రిడ్ చైర్మన్‌గా దాదాపు ఖరారైనట్లేనంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా ఇద్దరు సీనియర్ నాయకులు పోచారం శ్రీనివాస్‌రెడ్డిని మంత్రిగా, గోవర్ధన్‌కు విప్‌గా అవకాశమిచ్చిన సీఎం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కూడ రాష్ట్రస్థాయి పదవి కట్టబెట్టాల్సి ఉంది. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే నామినేటెడ్ పదవిని ఆశిస్తున్నారు. కాగా, ఎమ్మెల్యేలపైనా మార్కెట్ కమిటీ తదితర జిల్లాస్థాయి నామినేటెడ్ పదవుల కోసం ద్వితీయశ్రేణి నా యకుల ఒత్తిడి పెరిగింది.
బుగ్గ కారు దక్కేనా!!
Published Fri, Jan 2 2015 3:05 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement