సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రతి శాఖలో చేయాల్సిన పనులకు ప్రణాళికను రూపొందించామని, కొత్త సంవత్సరంలో ఆ మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న చె ప్పారు. మంగళవారం ఆయన ‘సాక్షి’ తో మాట్లాడారు. సంక్షేమం, వ్యవసాయం, విద్య, వైద్య రంగాలపై దృష్టి సారిస్తామన్నారు. 500 అంగన్‌వాడీ కేంద్రాలకు నూతన భవనాలను నిర్మించనున్నట్లు చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్ల వసతి కల్పించనున్నామన్నారు. పది అంగన్‌వాడీ ప్రాజెక్టులకు గాను ఆరు ప్రా జెక్టుల్లో అమృతహస్తం పథకాన్ని కొనసాగిస్తున్నామని, మరో రెండింటిని ఈ పథకంలోకి తీసుకు రానున్నట్లు పేర్కొన్నారు.ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ప్రసవాల కోసం వెళ్లే గర్భిణులకు 108 వాహన సౌకర్యం కల్పిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 75 శాతం ప్రసవాలు జరిగే విధంగా చర్య లు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్‌ను విస్తరింపచేస్తామన్నారు.
ఉత్తీర్ణత శాతాన్ని పెంచుతాం..
పదవ తరగతి పరీక్షల్లో జిల్లా ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు కృష్టి చేస్తామన్నారు. పదవ తరగ తి పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను నివారిస్తామన్నారు. పాఠశాలల్లో తాగునీటి వసతి కల్పిస్తామన్నారు. రెండు వందల పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో ఐదు ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రూ. 2.2 కోట్లతో బీసీ స్టడీ సర్కిల్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. తద్వారా 9 లక్షల మంది బీసీ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నా రు.ఉపాధి హామీ పథకం కింద రూ. 155 కోట్లు ఖర్చు చేశామని కలెక్టర్ తెలిపారు. కొత్త సంవత్సరంలో రూ. 190 కోట్లు ఉపాధి హామీ పను ల కోసం ఖర్చు చేసేందుకు ప్రణాళి కను రూ పొందిస్తున్నామన్నారు. కొత్తగా నిర్మించనున్న కలెక్టరేట్ భవన సముదాయానికి రూ. 23 కోట్లతో ప్రతిపాదనలు పంపామని తెలి పారు.
వ్యక్తిగత మరుగుదొడ్లు 1.50 లక్షలు నిర్మిం చేందుకు కృషి చేస్తున్నామని, వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. రబీ సీజన్‌లో రైతులకు రూ. 768 కోట్ల పంట రుణాలకు గాను రూ. 1000 కోట్లు పెంచి ఇవ్వాలని నిర్ణయిం చగా ఇప్పటి వరకు రూ. 350 కోట్లు రైతులకు పంపిణీ చేసినట్లు తెలి పారు. బ్యాంక్ లింకేజీ కింద మహిళా గ్రూపులకు రూ. 426 కోట్లకు గాను ఇప్పటి వరకు రూ. 160 కోట్లు అందజేసినట్లు తెలిపారు. శ్రీనిధి కింద ఇప్పటి వరకు రూ. 82 కోట్లు ఇచ్చామని, మార్చి నాటికి రూ. 120 కోట్ల వరకు అందజేయగలమన్నారు. ఈ ఏడాదిలో ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యం 19,500 కాగా ఇప్పటి వరకు 7వేల ఇళ్లు పూర్తి చేశామని తెలిపారు. నిజామాబాద్ బైపాస్ రోడ్డును ఫిబ్రవరి కల్లా పూర్తి చేయాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఆర్‌అండ్‌బీ పరిధిలోని రోడ్లను మార్చి కల్లా పూర్తి చేస్తామన్నా రు. ఆర్మూర్, కామారెడ్డి, గాంధారి ప్రాంతాల్లో మంచినీటి పథకాలను వెంటనే పూర్తిచేయగలమన్నారు.
సోయాపై బెంగవద్దు....
వచ్చే ఖరీఫ్ సీజన్‌లో 1.21 లక్షల హెక్టార్లలో సోయాబీన్ సాగవుతుందని అంచనా వేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. 90 వేల క్వింటాళ్ల సాయా విత్తనాలు అవసరం ఉండగా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జుక్కల్, ఆర్మూర్ ప్రాం తాల్లో రెండు సోయాబీన్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏడవ విడత భూపంపిణీలో భాగంగా 120 ఎకరాలను జనవరి 10 కల్లా పంపిణీ చేస్తామన్నారు. పభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల జవాబుదారీ తనం పెంచడం ద్వారా పారదర్శక పాలనను అందించేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. హాస్టళ్లలో వార్డెన్ల పనితీరును, స్థానికతను గుర్తించేందుకు కాల్‌సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాల్‌సెంటర్ ద్వారా వార్డెన్లకు అకస్మికంగా ఫోన్ చేయడంతో పాటు హాస్టల్‌లో ఉండే విద్యార్థులతో మాట్లాడుతామన్నారు. ఉద్యోగులు పనిచేసే చోటే నివాసం ఉండాలనే విధానాన్ని క్రమబద్దంగా అమలు చేయనున్నట్లు తెలిపారు.
కొత్త ఏడాదిలో..
Published Wed, Jan 1 2014 6:14 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement