
రానున్నది జగన్ ప్రభుత్వమే..
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు నాగార్జున
వించిపేట : రానున్నది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున పేర్కొన్నారు. బుధవారం వించిపేటలోని వైఎస్సార్ సీపీ నాయకుడు ఎం.ఎస్ బేగ్ కార్యాలయంలో ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న తప్పిదాలే ఆయన ప్రభుత్వ పతనానికి దారితీస్తున్నాయన్నారు.
రానున్నది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనన్నారు. దీనికి పార్టీ కార్యకర్తలందరూ కలసికట్టుగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకుడు ఎం.ఎస్ బేగ్, జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ ఎస్.ఎ షుకూర్, కార్పొరేటర్ పైడిమాల సుభాషిణి, పార్టీ నాయకులు బూదాల శ్రీనివాసరావు, కాలే పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.