తెలంగాణలో టీడీపీ ఉందా? | no space for tdp in telangana, harish rao says | Sakshi
Sakshi News home page

తెలంగాణలో టీడీపీ ఉందా?

Published Tue, Jan 5 2016 10:22 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

తెలంగాణలో టీడీపీ ఉందా? - Sakshi

తెలంగాణలో టీడీపీ ఉందా?

నారాయణఖేడ్: రాష్ట్ర విభజన సందర్భంలో తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానాలతో విసిగిపోయిన కార్యకర్తలు ఎప్పుడో ఆ పార్టీని వీడారు. అసలిప్పుడు తెలంగాణలో టీడీపీ ఉందా? ఆ పార్టీ గురించి మాట్లాడుకోవటం మనకు అవసరమా?' అని మంత్రి హరీశ్ రావు అన్నారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో మంగళవారం వివిద కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి స్థానికంగా ఏర్పాటుచేసిన సభల్లో పాల్గొన్నారు.

 

నారాయణఖేడ్ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యాన్ని గుర్తుచేస్తూ తెలంగాణలో లేని తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్లునని వ్యాఖ్యానించారు. కాగా, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి కన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని పక్కకునెట్టేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement