ఆయుక్షీణం | No treatment available in Ayush | Sakshi
Sakshi News home page

ఆయుక్షీణం

Published Tue, Aug 16 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

బందలుప్పి పీహెచ్‌సీలో మందులు, వైద్యుల్లేక ఖాళీగా ఆయుష్‌ కేంద్రం

బందలుప్పి పీహెచ్‌సీలో మందులు, వైద్యుల్లేక ఖాళీగా ఆయుష్‌ కేంద్రం

ఆయుష్‌ వైద్య విభాగాలకు నిరాదరణ
వైద్యులు, మందుల్లేక రోగుల అవస్థలు
 
 
పార్వతీపురం రూరల్‌: అల్లోపతి వైద్యంతో పాటు ఆయుర్వేదం, హోమియోపతి మందులను కూడా రోగులకు అందించాలన్న లక్ష్యంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఆయుర్వేద చికిత్స కేంద్రాలు నిరాదరణకు గురవుతున్నాయి. డోకిశీల, బందలుప్పి పీహెచ్‌సీల్లో ఆయుష్‌ విభాగాలను ఏర్పాటు చేసింది. బందలుప్పిలో ఆయుష్‌ కేంద్రాన్ని ఆరేళ్ల క్రితం ప్రారంభించి మందులను అధికంగా నిల్వ చేశారు. ఇక్కడ వైద్యుడిని నియమించినా డెప్యుటేషన్‌పై వేరే కేంద్రానికి పంపడంతో రోగులకు సక్రమంగా సేవలందడం లేదు. డోకిశీల పీహెచ్‌సీలోని ఆయుష్‌ విభాగంలో కూడా వైద్యుడు, మందుల్లేక ఖాళీగా దర్శనిమిస్తున్నాయి. బందలుప్పి ఆయుష్‌ కేంద్రాల్లో పనిచేస్తున్న కాంపౌండర్, అటెండర్లు ఆరు నెలలుగా జీతాలందుకోలేదు.
 
మందుల్లేక ఇబ్బందిగా ఉంది:  నల్ల నారాయణ రావు, బందలుప్పి
ఆయుర్వే విభాగంలో వైద్యుడు, మందులు లేకపోవడంతో మాకు ఇబ్బందిగా ఉంది. ఏళ్ళు గడుస్తున్నా ఈ సమస్యను పరిష్కరించడంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించడం విచారకరం.
 
 
ఎందుకీ ఆయుర్వేద విభాగం : శంకరాపు కౌశల్య, బందలుప్పి
వైద్యుడు, మందుల్లేని ఆయుర్వేద విభాగం ఎందుకు?. పీహెచ్‌సీలో ఆయుర్వేద విభాగం ఉందని చెప్పుకోవడానికే తప్ప దాంతో ఎలాంటి ఉపయోగం లేదు. వెంటనే వైద్యుడిని నియమించి మందులు సరఫరా చేయాలి. 
 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement