no medicines
-
‘మందు’లేని పాములెన్నో
ఎవరికైనా పాము కరిస్తే ఏమనుకుంటాం.. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్తే చాలు, ఇంజక్షన్ ఇస్తారు.. ప్రాణాపాయం తప్పిపోతుందని భావిస్తాం. కానీ, అదంతా ఓ భ్రమని.. అంత ధైర్యంగా ఉండే పరిస్థితి లేదంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే పాము కాటు విరుగుడుకు వాడుతున్న ‘పాలివలెంట్ యాంటీ వీనమ్’ ఇంజక్షన్ పూర్తిగా ఆధారపడ్డది కాదని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) అధ్యయనంలో వెల్లడైంది. కేవలం నాలుగు జాతుల పాముకాట్లకే అది విరుగుడుగా పనిచేస్తుందని.. మరో 60 విష సర్పాల కాట్లకు మందులేదన్నది చేదు నిజం అని తేల్చింది. ఆ నాలుగింటికే యాంటీ వీనమ్ ఇంజక్షన్.. దేశంలో పాముకాట్లకు వందేళ్లుగా ఒకే మందు వాడుతున్నారు. పాముకాటుకు గురైన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఒక్క ‘పాలివలెంట్ యాంటీ వీనమ్’ ఇంజక్షన్‌ను మాత్రమే ఇస్తున్నారు. కానీ, ఇది కేవలం నల్లత్రాచు, కట్ల పాము, రక్తపింజరి, ఇసుక పింజరి పాము కాట్లకు మాత్రమే విరుగుడుగా పనిచేస్తుందని.. అందులోనూ ఆ ఇంజక్షన్ పనితీరులో ప్రాంతానికి ప్రాంతానికి వ్యత్యాసం ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒకే జాతికి చెందినప్పటికీ పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్‌లోని పాముకాట్లకు ఈ మందు ఒకే విధంగా పనిచేయడంలేదని వారు పసిగట్టారు. 60 విషసర్పాల కాట్లకు విరుగుడేదీ? ప్రస్తుతం మన దేశంలో 270 జాతులకు చెందిన పాములు ఉన్నాయి. వాటిలో 60 జాతులు విషపూరితమైనవి. కానీ, వీటి కాట్లకు ఈ యాంటీ వీనమ్ ఇంజక్షన్ విరుగుడుగా పనిచేయడంలేదని అధ్యయనంలో తేలింది. చిన్న పింజరి, సింధ్ కట్లపాము, బాండెడ్ కట్లపాము, పలు నాగుపాముల విషానికి ఈ ఇంజక్షన్ విరుగుడుగా పనిచేస్తుందో లేదోనని శాస్త్రవేత్తలు పరిశీలించారు. కానీ, అది పనిచేయడంలేదని నిర్ధారించారు. ప్రధానంగా దేశంలోని పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో పాము కాట్లపై ఈ ఇంజక్షన్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతోందని గుర్తించారు. ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా పరిశోధనలు చేయాలి ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీవీనమ్ నాలుగు జాతుల పాము కాట్లకే విరుగుడుగా పనిచేస్తోందన్నది వాస్తవం. ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా పాము జాతుల విషానికి విరుగుడు మందు తయారీకి పరిశోధనలను విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. – డా. కంచర్ల సుధాకర్, హెచ్ఓడీ, జనరల్ మెడిసిన్ విభాగం, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, గుంటూరు ఏటా వేల మంది మృత్యువాత దేశంలో పాముకాట్లతో ఏటా దాదాపు 46 వేల మంది మృత్యువాతపడుతున్నారు. మరో 1.40 లక్షల మంది అంగవైకల్యానికి గురవుతున్నారు. సకాలంలో వారిని ఆస్పత్రులకు తీసుకువెళ్లి యాంటీ వీన మ్ ఇంజక్షన్లు వేయిస్తున్నప్పటికీ అవి సరిగా పనిచేయకపోవడమే అందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీ వీనమ్ ఇంజక్షన్ దాదాపు వందేళ్ల క్రితం దేశంలో ప్రవేశపెట్టారు. అప్పట్లో పాశ్చాత్య దేశాల్లో పాముకాట్లకు విరుగుడుగా కనుగొన్న యాంటీ వీనమ్ ఇంజక్షన్‌ను బ్రిటీషర్లు మన దేశంలోకి తీసుకువచ్చారు. కానీ, అప్పటి నుంచి భారత్‌లోని పాము జాతులు, వాటి విష తీవ్రతకు అనుగుణంగా పరిశోధనలు చేసి తగిన మందును ఇంతవరకు తయారుచేయకపోవడం విస్మయపరుస్తోంది. ఐఐఎస్సీ అధ్యయనంలో వెల్లడి దేశంలో పాము కాట్లతో ఏటా మృతులు- 46 వేలు అంగవైకల్యం బారిన పడుతున్న వారి సంఖ్య- 1.40 లక్షలు -సాక్షి, అమరావతి -
వామ్మో పాము!
సాక్షి, హైదరాబాద్ : పల్లెవాసులను పాముకాటు వణికిస్తోంది. సకాలంలో వైద్యం అందక, అందుబాటులో ఉన్న సర్కారు ఆస్పత్రుల్లో మందుల్లేక రాష్ట్రంలో ఏటా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఏటా 5 వేల మంది వరకు పాముకాటుకు గురవుతున్నారు. అనధికారికంగా ఈ సంఖ్య 10 వేలపైనే ఉంటుంది. వీరిలో ఏటా దాదాపు 600 మంది చనిపోతున్నారు. పాము కరిచిన బాధితులను గంటలోపు (గోల్డెన్ అవర్) ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడం వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. మనదేశంలో పశ్చిమబెంగాల్, ఏపీ, తమిళనాడుల్లో అత్యధిక పాము కాటు కేసులు నమోదవుతున్నాయి. అవగాహన ఇంకెప్పుడు? పాము కరిస్తే తక్షణమే ఆసుపత్రులకు తీసుకెళ్లాలన్న అవగాహన లేకపోవడం వల్లే ఎక్కువ మరణాలు చోటుచేసుకుంటున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్రామాల్లో ఇప్పటికీ మంత్రతంత్రాలపైనే ఆధారపడుతున్నారు. లేదంటే నాటు వైద్యుడిని ఆశ్రయిస్తున్నారు. ఓ అంచనా ప్రకారం 70 శాతం పాముకాటు కేసుల్లో నాటు వైద్యులను, మంత్రతంత్రాలనే నమ్ముతున్నారు. ఆసుపత్రుల్లో మందులేవీ? చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీలు) పాము కాటుకు అవసరమైన యాంటీ వీనం సీరం ఇంజక్షన్ అందుబాటులో ఉండటం లేదు. సాధారణంగా రాత్రి వేళల్లో పాము కాటుకు గురవుతుంటారు. ఆ సమయంలో ఆసుపత్రులు తెరిచి ఉండటం లేదు. అటుఇటూ తిరిగి చివరి నిమిషంలో పెద్దాసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోతోంది. రాష్ట్రంలో 31 రకాల పాములు మన దేశంలో 300 రకాల సర్పాలున్నాయి. అందులో 66 రకాల పాములే విషపూరితమైనవి. అందులోనూ 61 రకాల పాముల్లో మనిషిని చంపేంత విషం ఉండదు. మిగిలిన ఐదు రకాల పాములతోనే ప్రాణహాని ఉంటుంది. తెలంగాణలో 31 రకాల పాములున్నాయి. వాటిల్లో ఆరు పాములు మాత్రమే విషపూరితమైనవి. తాచుపాము, రక్తపింజర, కట్ల పాము, చిన్న పింజర రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. లంబిడి గాజుల పాము (ఇదో రకం కట్లపాము, ఏటూరునాగారం ఏరియాలో ఉంటుంది), ఇంకోటి బ్యాంబూ బిట్ వైఫర్(ఇది అరుదైన రక్త పింజర). ఈ ఆరు రకాల పాములే తెలంగాణలో విషపూరితమైనవి. మిగిలిన పాములు సాధారణమైనవే! వీటిల్లో తాచు పాములే 48 శాతం ఉంటాయి. పాము కరిస్తే ఏం చేయాలి? ఏమాత్రం ఆందోళన చెందకూడదు. ఎక్కువ ఆందోళన చెందితే బాధితుడి గుండె కొట్టుకునే వేగం పెరిగి పాము విషమంతా రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు చేరుతుంది. బాధితుడిని తక్షణమే ఆసుపత్రికి తీసుకెళ్లి యాంటీ వీనం సీరం ఇవ్వాలి. మంచినీరు, ఆహారం ఇవ్వొద్దు. పాము కరిచిన భాగాన్ని యాంటీ సెప్టిక్‌తో పూర్తిగా శుభ్రం చేయాలి. మంచుగడ్డలు (ఐస్) పెట్టొద్దు. అవగాహన ఉండటం లేదు పాములన్నీ విషపూరితం కాదు. పాము కరవగానే చాలామంది ఇప్పటికీ మంత్రతంత్రాల వైపే ఆకర్షితులవుతున్నారు. కొందరు నాటు వైద్యం చేయించుకుంటున్నారు. ఇదే మరణాలకు కారణమవుతోంది. – అవినాశ్, ప్రధాన కార్యదర్శి, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ, తెలంగాణ ఆస్పత్రుల్లో మందులున్నాయి పాము కాటుకు ప్రాథమిక ఆస్పత్రుల్లో వైద్యం అందుబాటులో ఉంది. యాంటీ వీనం సీరం మందు అన్నిచోట్లా అందుబాటులో ఉంచాం. – సుకృతారెడ్డి, జాయింట్ డైరెక్టర్, ఎపిడమిక్స్, తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ -
మందులేని మహమ్మారి
గత కొన్నేళ్లనుంచి క్రమం తప్పకుండా వచ్చి బెంబేలెత్తిస్తున్న వైరస్ల జాబితాలో నిపా కూడా చేరింది. కేరళలోని కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో బయటపడి ఆ వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తూ మరణించిన ఒక నర్సుతోసహా ఇంతవరకూ పదకొండుమంది ప్రాణాలు కోల్పోయారు. నిపా వైరస్‌ను ఈ ఏడాది అత్యవసరంగా పరిశోధించదగిన 10 వ్యాధికారకాల్లో ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం వల్లనైతేనేమి...సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతుండటం వల్లనైతేనేమి ఆ వ్యాధి పేరెత్తితే జనం బెంబేలు పడిపోతున్నారు. పరిశోధించదగిన వ్యాధికారకమని చెప్పడమంటే ఈ వైరస్‌కు ప్రస్తుతం మందు లేదని ప్రకటించడమే. అది కేరళలోని రెండు జిల్లాల్లో రెండు ప్రాంతాల్లో బయటపడింది తప్ప వేరెక్కడా దాని జాడ లేదని... వెంటనే ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నాం గనుక భయాందోళనలు అనవసరమని కేరళ ప్రభుత్వం ప్రకటించాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈలోగానే పొరుగునున్న కర్ణాటకలోని మంగళూరులో దాని ఛాయలు కనబడ్డాయని వార్తలు రావడంతో మళ్లీ వణుకు మొదలైంది. జ్వరంతో మొదలై శ్వాసకోశ ఇబ్బందులు, కండరాల నొప్పులు, తలనొప్పి, వాంతులు వగైరాలన్నీ చుట్టుముట్టి రోగిని ఊపి రాడకుండా చేస్తాయని... పది పన్నెండు రోజులకు అపస్మారక స్థితికి తీసుకెళ్తుందని వైద్యులు చెప్పే మాట. చివరిగా బ్రెయిన్ ఫీవర్‌తో మరణం సంభవిస్తుందని చెబుతున్నారు. వ్యాధి సోకినవారిలో 70 శాతంమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు నిపా వైరస్ కావొచ్చు... రెండేళ్లక్రితం జికా వైరస్ కావొచ్చు...అంతకు రెండేళ్ల ముందు ఆఫ్రికాను వణికించిన ఎబోలా కావొచ్చు... మధ్యమధ్యన అడపా దడపా కనిపిస్తూనే ఉన్న స్వైన్‌ఫ్లూ కావొచ్చు–ఇవన్నీ కొత్త వ్యాధులు కావు. కానీ కొత్తగా శక్తి సంతరించుకుని మళ్లీ మళ్లీ వస్తున్న మహమ్మారులు. నిపా కూడా మొదటగా 1999లో మలేసియాలోని కాంపంగ్ సుంగై నిపా అనే పట్టణంలో వెల్లడైంది. అప్పట్లో 300మందికి ఇది సోకగా వారిలో వందమంది చనిపోయారు. ఆ తర్వాత 2001లో పశ్చిమబెంగాల్లోని సిలిగుడిలో దీని జాడ వెల్లడైంది. దాన్ని నిపా వైరస్‌గా గుర్తించేసరికే ఆర్నెల్లు పట్టింది. ఈలోగా 45మంది ఆ వ్యాధితో మృత్యువాత పడ్డారు. అప్పటితో పోలిస్తే వ్యాధిని వెనువెంటనే గుర్తించగలిగారు. దాని నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విషయంలో కేరళ ప్రజారోగ్య సిబ్బందిని ప్రశంసించాలి. రెండో వ్యాధిగ్రస్తుడి తోనే ఈ వైరస్ ఉనికిని అక్కడి వైద్యులు పసిగట్టగలిగారు. అయితే గతంతో పోలిస్తే ఒకచోటు నుంచి మరోచోటుకు రాకపోకలు కూడా బాగా పెరిగాయి గనుక ఒకచోట నియంత్రణకు పూనుకునే లోగానే మరోచోట అది కనబడే ప్రమాదం కూడా లేకపోలేదు. అందువల్లే ఇటువంటి వ్యాధుల విషయంలో తక్షణ స్పందన అత్యవసరం. ఆ ఉద్దేశంతోనే ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలంగాణ ప్రభుత్వం అంటున్నది. వ్యాధి నిరోధక వైద్య సంస్థ(ఐపీఎం)ను నోడల్ ఏజెన్సీగా ఉంచి ప్రధాన ఆసుపత్రులన్నిటా ప్రత్యేక వార్డులు నెలకొల్పామని చెబుతోంది. దీంతోపాటు వ్యాధి లక్షణాలపై బాగా ప్రచారం చేసి, అవి కనబడిన వెంటనే తగిన వైద్య పరీక్షలు చేయించాలన్న అవగాహన పెంచాలి. ఒకరి నుంచి మరొకరికి నేరుగా వ్యాపించే లక్షణం నిపా వైరస్‌కు లేకపోవడం ఉన్నంతలో ఉపశమనమనే అనుకోవాలి. లేనట్టయితే అధిక జనాభా, అరకొర పారిశుద్ధ్యం ఉన్న మనలాంటి దేశాల్లో అది ఉగ్రరూపం దాల్చడం తేలిక. నిపా వైరస్ ఆర్ఎన్ఏ వైరస్ గనుక అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులంటున్నారు. ఈ రకం వైరస్లలో ఆకస్మిక పరివర్తనం అధికంగా ఉండటమే అందుకు కారణం. అందువల్లే నిపా మనిషి శరీరంలో వేగంగా, అపరిమితంగా విస్తరిస్తుంది. వ్యాధిగ్రస్తుల్లో ఏకకాలంలో అనేక రకాల లక్షణాలు కనబడటానికి, మరణాల రేటు అధికంగా ఉండటానికి కారణం ఇదే. అయితే అంటు వ్యాధి కాకపోవడంవల్ల ఇతరులకు వేగంగా సోకే అవకాశం లేదు. ఇప్పుడు గబ్బిలాలు కొరికి పడే సిన పండ్లు తిన్నవారికి ఈ వ్యాధి వ్యాపిస్తోంది. అలాగే వ్యాధిగ్రస్తులకు పరిచర్యలు చేసే ఆసుపత్రి సిబ్బందికి, ఆ వ్యాధిగ్రస్తులతో సన్నిహితంగా మెలిగే బంధువులకు తగిన ముందస్తు చర్యలు తీసు కోనట్టయితే సోకే ప్రమాదం ఉన్నదని గుర్తించారు. కేరళలో మరణించిన 11మందిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం వెనక ఇలాంటి కారణమే ఉండొచ్చని అంచనా. అలాగే ఆ కుటుంబం నివసించే ఇంటి ఆవరణలో ఉన్న బావిలోని గబ్బిలాల వల్ల అక్కడ వ్యాధికారక వైరస్‌కు అవకాశం ఏర్పడిందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. వ్యాధులకు ఔషధాలున్నా వాటి ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడం మన దేశంలో ప్రధాన సమస్య. వ్యాధి వ్యాప్తిని అరికట్టడం, వ్యాధిని నిర్మూలించడం వంటి అంశాలపై శ్రద్ధ పెట్టడానికి బదులు దాన్నుంచి ఎంత లాభం తీయొచ్చన్నదే ప్రధానమైనప్పుడు ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించడం అసాధ్యమవుతుంది. ఇప్పుడు నిపాతో వచ్చిపడిన సమస్యే మంటే దానికి ఇంతవరకూ మందే లేదు. వ్యాధిగ్రస్తుల్లో కనబడే వేర్వేరు లక్షణాలకు వేర్వేరు ఔషధాలు అందించడం ద్వారా దాన్ని అదుపు చేస్తున్నారు. ఈ వైరస్ విషయంలో ప్రభుత్వాలన్నీ అత్యంత అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. ఆసుపత్రులను అప్రమత్తం చేయాలి. జంతువులు, పక్షులు కొరికి వదిలేసిన పండ్లు తినకూడదని, పరిశుభ్రత అతి ముఖ్యమని జనంలో అవగాహన కల్పించాలి. అల్లోపతిలో ఔషధాలు లేవు గనుక హోమియో, ఆయుర్వేదం, యునాని రంగాల్లోని వైద్య నిపుణుల సేవలు కూడా ప్రభుత్వాలు వినియోగించుకోవాలి. -
మందుల్లేవ్!
జిల్లాస్పత్రిలో దయనీయ పరిస్థితి జర్వం, దగ్గు మందులు కూడా కరువు ప్రతి చిన్న రోగానికి బయట కొనాల్సిందే అవస్థలు పడుతున్న నిరుపేద రోగులు మహబూబ్‌నగర్ క్రైం: పేరుకే పెద్దాస్పత్రి.. ప్రతిరోజూ వందలాది మంది రోగులు తమ వ్యాధులను నయం చేసుకునేందుకు ఎంతో ఆశతో ఇక్కడికి వస్తున్నారు. కానీ వారికి కావాల్సిన మందులు దొరకడం లేదు. సీజనల్ వ్యాధుల కాలం కావడంతో కనీసం జ్వరం, దగ్గుకు సంబంధించిన మందులు సైతం అందుబాటులో లేవు. జిల్లా మందుల పంపిణీ కేంద్రం నుంచి కొన్ని రకాలే సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. అవసరమైన ఇతర మందులను ఆస్పత్రి అధికారులు బయట కొనుగోలు చేసి అందించాలి.. కానీ బడ్జెట్ లేదని చెబుతున్నారు. బయట కొనాల్సిందే.. జిల్లా మందుల పంపిణీకేంద్రం నుంచి సరఫరా కానీ మందులను జిల్లాస్పత్రి యంత్రాంగం కొనుగోలు చేసి రోగులకు అందించాలి. ఇందుకోసం అవసరమైన బడ్జెట్ ఆస్పత్రిలో లేదని అధికారులు చెబుతున్నారు. ఆరునెలల నుంచి బయట మందులు కొనుగోలు చేయడానికి రూ.6లక్షల బడ్జెట్ ఇప్పటివరకు రాలేదని ఓ అధికారి చెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యులు రాసిచ్చిన మందుల్లో కొన్ని మాత్రమే దొరుకుతున్నాయి. మిగతా మందులు బయట కొనుగోలు చేసుకోవాలని స్థానిక విధుల్లో ఉన్న సిబ్బంది రోగులకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సాధారణ మందులు కూడా లభించడం లేదు. ఇటీవల వాతావరణ మార్పుల కారణంగా చాలామంది చిన్నారులు జ్వరం, జలుబుతో ఆస్పత్రికి వస్తున్నారు. చిన్న పిల్లలకు టానిక్‌లు ఇవ్వాల్సి ఉంది. కాగా, జ్వరానికి అవసరమైన పారాసిటమాల్ టానిక్ కొన్ని రోజులుగా ఆస్పత్రిలో అందుబాటులో లేదు. అంటాసిడ్ సిరప్, క్యాల్షియం, ఐరన్ పొలిక్ మాత్రలు కూడా లేవు. ఇక నొప్పులు తగ్గించడానికి వాడే మాత్రలు రెండురోజులు అందుబాటులో ఉంటే మరో రెండు రోజులు లభించడం లేదు. ఆర్థికస్థోమత ఉన్న రోగులు బయట ప్రైవేట్ మందుల దుకాణాల్లో కొనుగోలు చేసుకుంటున్నారు. స్థోమత లేనివారు ఇచ్చిన మందుల వాడుతూ ఆరోగ్యం మెరుగుపడక ఇబ్బందులు పడుతున్నారు. అంతా సర్దుబాటే.. ఔట్ పేషంట్లు పరిస్థితి ఇలా ఉంటే ఆస్పత్రిలో ఉండి వైద్యం పొందుతున్న రోగుల పరిస్థితి అందుకు విభిన్నంగా ఏమీ లేదు. వైద్యులు రాసిచ్చిన మందులు అందుబాటులో లేకపోతే బయటనుంచి తెచ్చుకోవాలని సిబ్బంది సూచిస్తున్నారు. లేదా ఉన్న మందులనే సర్దుబాటు చేస్తున్నారు. మందులన్నీ ఎందుకు లేవని రోగులు ప్రశ్నించలేని పరిస్థితి. ప్రశ్నిస్తే వైద్యులు, సిబ్బందికి కోపం వచ్చి సరిగ్గా వైద్యం అందిస్తారో లేదోననే భయం వారిలో ఉంది. బడ్జెట్ రాక.. మందులు కొనక.. జిల్లా మందుల కేంద్రం నుంచి జిల్లా జనరల్ ఆస్పత్రికి మందులను సరఫరా చేయడానికి ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు రూ.30లక్షల నిధులు కేటాయిస్తోంది. అలాగే మందులు లేని సమయంలో అత్యవసర పరిస్థితుల్లో బయట మందులు కొనుగోలు చేయడానికి ప్రతి మూడు నెలలకోసారి రూ.3 లక్షల నిధులు ఇస్తోంది. ఆరు నెలలుగా ఈ నిధులు రాకపోవడంతో సమస్య తీవ్రమైంది. బడ్జెట్ కేటాయించిన తర్వాత సకాలంలో వాటిని విడుదల చేయకపోవడంతో మందులు కొనుగోలు చేయలేకపోతున్నారు. ప్రస్తుతం 450 రకాల మందులు మాత్రమే సరఫరా అవుతున్నాయి. అత్యవసరమైన పిల్లల జ్వరం టానిక్(పారసిటమాల్) సైతం సరఫరా కావడం లేదు. విరేచనాలకు అవసరమైన ఫెరజోలడోన్, మానసిక రోగులకు, అత్యవసర రోగులకు నిద్ర కోసం అందించాల్సిన డైజోఫామ్ మాత్రలు, ఇంజక్షన్ సైతం సరఫరా లేదు. మరోవైపు మందులకు కేటాయిస్తున్న నిధులు.. ఖర్చు, సరఫరా చేస్తున్న మందులపైన సరైన పర్యవేక్షణ లేకుండాపోయింది. అత్యవసర మందులు కరువు ప్రస్తుతం ఆస్పత్రిలో అత్యవసరమందులు అందుబాటులో లేవు. పారాసిటమల్, సైక్లోఫామ్, డెరిఫైలిన్, ఆర్టిసోనేట్, ఈమాల్, క్వినైన్ సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, కిటామైన్, మెడజోలం వంటి ఇంజక్షన్లు కూడా లేవు. డైక్లోఫెనాక్, సర్భిట్రేట్, బీకాంప్లెక్స్, డెపిన్(సబ్లింగ్వల్ క్యాప్సల్), విటమిన్ ‘ఏ’ ద్రవం ఆస్పత్రిలో దొరకడం లేదు. వీటిని కొనుగోలు చేస్తున్నామని వైద్యులు చెబుతున్నా.. రోగులకు మాత్రం ఇవ్వడం లేదు. ఆరునెలల బడ్జెట్ రావాలి మందుల నిల్వ కేంద్రంలో మందులు లేని సమయంలో బయట కొనుగోలు చేయడానికి అవసరమైన బడ్జెట్ ఆరు నెలల నుంచి రావడం లేదు. దీంతో కొంత ఇబ్బందికరంగా ఉంది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాను. ప్రస్తుతం సీజనల్ కావడంతో అత్యవసరమైన మందులను తీసుకువస్తాం. –రాంబాబునాయక్, జిల్లాస్పత్రి సూపరింటెండెంట్ ఐదు రకాలు రాస్తే.. ఒక్కటీ లేదు! జిల్లాకేంద్రంలోని పోలీస్‌లైన్ చెందిన సుమలత మంగళవారం మోకాళ్ల నొప్పులు రావడంతో వైద్యం కోసం జిల్లాస్పత్రికి వచ్చింది. నొప్పులు తగ్గడానికి డాక్టర్ ఐదు రకాల మందులు రాసిచ్చాడు. చీటి తీసుకుని మందుల సెంటర్‌కు వెళితే.. అక్కడ ఉన్న వారు చీటి చూసి ఇవీ లేవు బయట తీసుకోమని సలహా ఇచ్చారు. చీటిపై రాసిన ఐదు రకాల మందుల్లో ఏ ఒక్కటీ లేకపోవడంతో ఈ ఆస్పత్రికి రావడం లాభం లేదని ఆమె తిట్టుకుంటూ వెళ్లిపోయింది. -
ఆయుక్షీణం
ఆయుష్ వైద్య విభాగాలకు నిరాదరణ వైద్యులు, మందుల్లేక రోగుల అవస్థలు పార్వతీపురం రూరల్: అల్లోపతి వైద్యంతో పాటు ఆయుర్వేదం, హోమియోపతి మందులను కూడా రోగులకు అందించాలన్న లక్ష్యంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఆయుర్వేద చికిత్స కేంద్రాలు నిరాదరణకు గురవుతున్నాయి. డోకిశీల, బందలుప్పి పీహెచ్‌సీల్లో ఆయుష్ విభాగాలను ఏర్పాటు చేసింది. బందలుప్పిలో ఆయుష్ కేంద్రాన్ని ఆరేళ్ల క్రితం ప్రారంభించి మందులను అధికంగా నిల్వ చేశారు. ఇక్కడ వైద్యుడిని నియమించినా డెప్యుటేషన్‌పై వేరే కేంద్రానికి పంపడంతో రోగులకు సక్రమంగా సేవలందడం లేదు. డోకిశీల పీహెచ్‌సీలోని ఆయుష్ విభాగంలో కూడా వైద్యుడు, మందుల్లేక ఖాళీగా దర్శనిమిస్తున్నాయి. బందలుప్పి ఆయుష్ కేంద్రాల్లో పనిచేస్తున్న కాంపౌండర్, అటెండర్లు ఆరు నెలలుగా జీతాలందుకోలేదు. మందుల్లేక ఇబ్బందిగా ఉంది: నల్ల నారాయణ రావు, బందలుప్పి ఆయుర్వే విభాగంలో వైద్యుడు, మందులు లేకపోవడంతో మాకు ఇబ్బందిగా ఉంది. ఏళ్ళు గడుస్తున్నా ఈ సమస్యను పరిష్కరించడంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించడం విచారకరం. ఎందుకీ ఆయుర్వేద విభాగం : శంకరాపు కౌశల్య, బందలుప్పి వైద్యుడు, మందుల్లేని ఆయుర్వేద విభాగం ఎందుకు?. పీహెచ్సీలో ఆయుర్వేద విభాగం ఉందని చెప్పుకోవడానికే తప్ప దాంతో ఎలాంటి ఉపయోగం లేదు. వెంటనే వైద్యుడిని నియమించి మందులు సరఫరా చేయాలి. -
పేరుకే పెద్దాసుపత్రి
ఇబ్బందులు పడుతున్న రోగులు జగిత్యాల ఆస్పత్రి దుస్థితి జగిత్యాల అర్బన్ : జగిత్యాల ప్రాంతంలో వర్షాకాల సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రజలు చికిత్సల కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో డెంగ్యూ, డయేరియా, విరేచనాలు, విష జ్వరాలు వస్తున్నాయి. రోగాలతో బాధపడుతూ ప్రభుత్వాసుపత్రికి వచ్చిన వారికి మందులు సరిగా అందడం లేదు. దీంతో పేదలకు సర్కారు వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతోంది. జగిత్యాల ప్రాంతంలో ప్రజలకు వైద్యసేవలు అందించడానికి 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. సర్కారు వైద్యం కోసం 14 మండలాల ప్రజలతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా పేదలు ఏరియా అస్పత్రికి వస్తుంటారు. నిత్యం సుమారు 600 మంది ఔట్ పేషెంట్లుగా 100 నుంచి 150 మంది వరకు ఇన్ పేషెంట్లు గా చికిత్స పొందుతారు. వ్యాధుల సీజన్ కావడంతో ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చికిత్సకోసం ఇక్కడికి వచ్చే వారికి మందులతో పాటు ప్లూయిడ్స్ లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధులు నయం కాకపోవడంతో ప్రైవేటు అస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కరీంనగర్ సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి మూడు నెలలకొకసారి రూ. 7.20 లక్షల మందులను సరఫరా చేస్తారు. సీజనల్ వ్యాధులతో రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ మందులు సరిపోవడం లేదు. యాంటిబయాటిక్స్, జెంటామైసిన్, ఫ్లూయిడ్స్ సరిగా పంపిణీ కాకపోవడంతో వ్యాధులు నయం కావడం లేదు. ప్లూయిడ్స్ కరువు : వర్షాకాలంలో డయేరియా, వైరల్ ఫీవర్ ఎక్కువగా వస్తుంటాయి. చికిత్సలో భాగంగా రోగికి ముందుగా ఫ్లూయిడ్స్ పెడుతారు. విరేచనాలైనప్పుడు వాడే రింగర్ లక్టేట్ (ఆర్ఎల్) ఫ్లూయిడ్ అవసరంకాగా ఇవి ఆస్పత్రిలో లేవు. దీంతో రోగులు బయట కొనుగోలు చేయాల్సి వస్తుంది.