న్యూట్రిషన్ కౌన్సిలర్ల ఆందోళన | Nutrition counselors concern | Sakshi
Sakshi News home page

న్యూట్రిషన్ కౌన్సిలర్ల ఆందోళన

Published Wed, Nov 2 2016 2:02 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM

న్యూట్రిషన్ కౌన్సిలర్ల  ఆందోళన - Sakshi

న్యూట్రిషన్ కౌన్సిలర్ల ఆందోళన

సారవకోట :  అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో పనిచేస్తున్న న్యూట్రిషన్ కౌన్సిలర్లు తమకు జరిగిన అన్యాయంపై తిరగబడ్డారు. తొలగింపు ఉత్తర్వులను తిరస్కరిస్తూ నిరసన వ్యక్తం చేశారు. సారవకోట మండలంలో 61 మంది న్యూట్రిషన్ కౌన్సిలర్లు పనిచేస్తున్నారు. వీరంతా మంగళవారం వచ్చి తొలగింపు ఉత్తర్వులు తీసుకెళ్లాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ల ద్వారా సమాచారం అందించారు. ఈ మేరకు కౌన్సిలర్లంతా మంగళవారం సారవకోట సెక్టార్ సూపర్‌వైజర్ కార్యాలయానికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న టీడీపీ కార్యాలయంలోకి వెళ్లి నాయకులను నిలదీశారు.
 
 ఈ సందర్భంగా న్యూట్రిషన్ కౌన్సిలర్లు మాట్లాడుతూ ఇంటర్వ్యూలు నిర్వహించి నియమించిన తమను అర్ధంతరంగా తొలగించడం అన్యాయమని ఆరోపించారు. మార్చి నుంచి తమకు వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు ఉద్యోగం నుంచి తొలగించడం భావ్యం కాదన్నారు. అనంతరం తొలగింపు ఉత్తర్వులు తీసుకోకుండానే వెనుదిరిగారు. అయితే ప్రాజెక్టు సిబ్బంది మాత్రం తొలగింపు ఉత్తర్వులను రిజిస్టర్ పోస్టు ద్వారా ఆయా కౌన్సిలర్లకు పంపించడం గమనార్హం.
 
 కంచిలి : అంగన్‌వాడీ కేంద్రాల్లో న్యూట్రిషన్ కౌన్సిలర్లుగా నియమితులైన వారి పోస్టులను రద్దు చేస్తూ ఐసీడీఎస్ అధికారులు మెమోలు పంపించడంతో సర్వత్రా నిరసనలు వెల్లువెత్తారుు. ఇచ్ఛాపురం రూరల్ ప్రాజెక్టు పరిధిలో నియమితులైన న్యూట్రిషన్ కౌన్సిలర్లు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగారు. మంగళవారం మండల కేంద్రం కంచిలిలో బలియాపుట్టుగ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో కంచిలి, తలతంపర సెక్టార్ల పరిధి న్యూట్రిషన్ కౌన్సిలర్లను సమావేశపర్చి మధ్యాహ్నానికి మెమోలు ఇచ్చేందుకు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పి. కళ్యాణి వచ్చారు. అరుుతే మెమోలు తీసుకునేందుకు కౌన్సిలర్లు తిరస్కరించారు. నిబంధనల ప్రకారం నియామకాలు జరిగినా, తాము అప్పులు చేసి అధికార పార్టీ నేతలకు డబ్బులు కట్టామని వాపోయారు.
 
  ఒక్కొక్కరు రూ.30 వేలు నుంచి రూ.50 వేలు నేతలకు ముడుపులు ఇచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు.తమ జీతాలు పూర్తిగా చెల్లించి, తాము నేతలకు కట్టిన డబ్బుల్ని వడ్డీతో సహా చెల్లించి, మా పోస్టులను తిరిగి ఇవ్వాలని డిమాండు చేశారు. తమ విషయమై స్పష్టత ఇచ్చే వరకు బయటకు విడిచిపెట్టేది లేదని సూపర్‌వైజర్‌కు స్పష్టం చేశారు. అరుుతే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని నచ్చజెప్పడంతో విడిచిపెట్టారు. న్యూట్రిషన్ కౌన్సిలర్ల ఆందోళనకు వైఎస్సార్ సీపీ నేతలు ఇప్పిలి కృష్ణారావు, కొత్తకోట శేఖర్, దుర్గాసి ధర్మారావు, మునకాల వీరాస్వామి తదితరులు మద్దతు ప్రకటించారు. అవసరమైతే వారి తరఫున కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు.

 అన్యాయం
 ఏడాదిన్నరగా విధులు నిర్వహిస్తున్న తమకు ముందస్తు సమాచారం లేకుండా అర్ధంతరంగా విధుల నుంచి తొలగించడం అన్యాయం.  
 -కె శాంతి, న్యూట్రిషన్ కౌన్సిలర్, అన్నుపురం,
 
 సారవకోట మండలం
 న్యాయ పోరాటం చేస్తాం
 తమని అర్ధంతరంగా విధుల నుంచి తొలగించడంపై న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతాం. మిగిలిన ప్రాజెక్టుల పరిధిలో తొలగింపునకు గురైన కౌన్సిలర్లతో చర్చించి న్యాయ పోరాటానికి దిగుతాం.
 -జె.మాధవి, న్యూట్రిషన్ కౌన్సిలర్, జగన్నాథపురం,
 సారవకోట మండలం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement