అసిఫ్‌నహర్ కాల్వ పరిశీలన
శాలిగౌరారం : నార్కట్‌పల్లి మండలం అక్కెనపల్లి చెరువు నుంచి శాలిగౌరారం మండలంలోని ఐదు గ్రామాల చెరువులను నింపే అసిఫ్‌నహర్ కాల్వను రాష్ట్ర నీటిపారుదల శాఖ చీప్ ఇంజనీర్ సురేశ్‌కుమార్ శనివారం పరిశీలించారు. కాల్వతో పాటు ఆయా గ్రామాల్లోని చెరువులు, వాటి కింద సాగు విస్తీర్ణం, కాల్వ నిర్మాణానికి కావాల్సిన భూమి తదితర విషయాలను సంబంధిత జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అసిఫ్‌నహర్ కాల్వ ద్వారా నార్కట్‌పల్లి మండలం అక్కెనపల్లి, నక్కలపల్లిపాటు శాలిగౌరారం మండలంలోని భైరవునిబండ, తక్కెళ్లపహాడ్, ఆకారం, వల్లాల, పెర్కకొండారం గ్రామాల పరిధిలోని చెరువులను నింపవచ్చన్నారు. ఆయా చెరువుల కింద సుమారు 3 వేల ఎకరాలు సాగులోకి రానుందని తెలిపారు. ఆయనవెంట నీటి పారుదలశాఖ ఎస్‌ఈ ధర్మానాయక్, ఈఈ సుందర్‌నాయక్, డీఈఈ లింగయ్య, ఏఈ చంద్రశేఖర్, సింగిల్‌విండో చైర్మన్ లోకసాని రంగారెడ్డి, నాయకులు అయితగోని వెంకన్న, భూపతి వెంకన్న, ఈదులకంటి యాదయ్య, పులిగిళ్ళ శంకరయ్య తదితరులు ఉన్నారు.